ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Published : Nov 13, 2018, 01:52 PM ISTUpdated : Nov 13, 2018, 04:01 PM IST
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

సారాంశం

ఈ ప్రమాదంలో భార్యాభర్తలతోసహ 11నెలల వయస్సున పాప కూడా మృతిచెందింది. 

హైదరాబాద్ నగర శివారులోకి కీసర వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలతోసహ 11నెలల వయస్సున పాప కూడా మృతిచెందింది. 

టీఎస్ 07ఎఫ్ఎన్4548 అనే నెంబర్ గల మారుతి ఆల్టో కారు వేగంగా వస్తూ ఎడమ వైపున ఉన్న రెయిలింగ్‌ను ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జు అవగా అందులో ప్రయాణిస్తున్న ముగ్గురూ మృతిచెందారు. 

సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం