తార్నాక ఫ్లైఓవర్ పై ప్రమాదం

Published : Sep 26, 2020, 10:36 AM IST
తార్నాక ఫ్లైఓవర్ పై  ప్రమాదం

సారాంశం

ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో చోటుచేసుకుంది. కాగా.. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

తార్నాక ఫ్లైఓవరపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిద్రమత్తులో భారీ ట్రక్కు తార్నాక ఫ్లైఓవర్ డివైడర్ ను ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న మరో గోడను ఢీకొట్టి భారీ ట్రక్కు ఆగిపోయింది. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో చోటుచేసుకుంది. కాగా.. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

కాగా.. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం వాటిల్లలేదు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే..భారీ ట్రక్కు ఆగిపోవడంతో చాలా చేపు ట్రాఫిక్  స్తంభించిపోయింది. దీంతో.. పోలీసులు రెండు భారీ క్రేన్లు తప్పించి.. ట్రక్కును అక్కడి నుంచి తొలగించారు. కాగా.. ఆ భారీ ట్రక్కు.. ఎర్ర గడ్డ నుంచి ఉప్పల్ వెళ్తుండగా చోటుచేసుకుంది. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు