తెలంగాణ కరోనా: కొత్తగా 2,239 పాజిటివ్ కేసులు, 11 మంది మృతి

Published : Sep 26, 2020, 10:10 AM IST
తెలంగాణ కరోనా: కొత్తగా 2,239 పాజిటివ్ కేసులు, 11 మంది మృతి

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 83 వేల మార్కును దాటింది. హైదరాబాదులో కొత్తగా 300కు పైగా కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2239 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 83 వేల 866కు చేరుకుంది. 

గత రాత్రి 8 గంటల వరకు 58స925 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ మేరకు శనివారం తెలంగాణ ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా కారణంగా 11 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1091కి చేరుకుంది. 

కరోనా బారి నుంచి శుక్రవారం ఒక్క రోజులో 2,181 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో లక్షా 52 లక్షల 441 మంది కరోనా నుంచి కోలుకున్నారు తెలంగాణలో ఇంకా 30,334 యాక్టివ్ కేసులున్నాయి. వారిలో 24,683 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 28,00,761 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

గత 24 గంటల్లో తెలంగాణలో జిల్లాలవారీగా నమోదైన కరోనా వైరస్ కేసులు ఇలా ఉన్నాయి...

ఆదిలాబాద్ 27
భద్రాద్రి కొత్తగూడెం 91
జీహెచ్ఎంసి 316
జగిత్యాల 54
జనగామ 35
జయశంకర్ భూపాలపల్లి 29
జోగులాంబ గద్వాల 29
కామారెడ్డి 60
కరీంనగర్ 106
ఖమ్మం 73
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 12
మహబూబ్ నగర్ 34
మహబూబాబాద్ 57
మంచిర్యాల 31
మెదక్ 31
మేడ్చెల్ మల్కాజిగిరి 164
ములుగు 33
నాగర్ కర్నూలు 43
నల్లగొండ 141
నారాయణపేట 34
నిర్మల్ 31
నిజామాబాద్ 69
పెద్దపల్లి 32
రాజన్న సిరిసిల్ల 57
రంగారెడ్డి 192
సంగారెడ్డి 66
సిద్ధిపేట 79
సూర్యాపేట 63
వికారాబాద్ 29
వనపర్తి 35
వరంగల్ రూరల్ 37
వరంగల్ అర్బన్ 91
యాదాద్రి భువనగిరి 58

 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu