మహేశ్వరం గ్యాంగ్‌రేప్ కేసు: నలుగురు నిందితుల అరెస్ట్

Siva Kodati |  
Published : Aug 23, 2019, 11:28 AM ISTUpdated : Aug 23, 2019, 11:29 AM IST
మహేశ్వరం గ్యాంగ్‌రేప్ కేసు: నలుగురు నిందితుల అరెస్ట్

సారాంశం

మహేశ్వరంలో ఒడిషాకు చెందిన మహిళ గ్యాంగ్‌రేప్ కేసును పోలీసులు ఛేదించారు. అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు

మహేశ్వరంలో ఒడిషాకు చెందిన మహిళ గ్యాంగ్‌రేప్ కేసును పోలీసులు ఛేదించారు. అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే... ఒడిశా రాష్ట్రం బలంగీర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల వివాహిత తన భర్త, కుమారుడితో కలిసి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చారు.

మహేశ్వరం ప్రాంతంలోని ఇటుకల బట్టీలో దంపతులిద్దరు పనికి చేరారు. అయితే ఒడిషాకే చెందిన నలుగురు యువకులు కూడా అక్కడే పనిచేస్తుంటారు. ఈ క్రమంలో వివాహితపై కన్నేసిన కామాంధులు శుక్రవారం రాత్రి ఆమె బహిర్భూమికి వెళ్లగా యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

భర్త సాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ దారుణానికి పాల్పడిన వారిని రాహూల్ మాజీ, మనోజ్ సమారత్, దుర్గా సమారత్, దయా మాజీగా గుర్తించారు. 

ఒడిషా మహిళపై హైదరాబాద్‌లో గ్యాంగ్‌రేప్, నిందితులది అదే రాష్ట్రం

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ