Latest Videos

మహాలక్ష్మి పథకం మగవాళ్లకే కలిసొచ్చిందట.. ఎలాగంటే...

By SumaBala BukkaFirst Published Dec 21, 2023, 7:53 AM IST
Highlights

మరోవైపు నాన్ పీక్ అవర్స్ లో మెట్రో రైళ్లు ఖాళీగా కూడా ఉంటున్నాయి. ఉదయం, సాయంత్రాలు మాతమ్రే మెట్రోలు ఫుల్ అవుతున్నాయి. ఇది ఆర్టీసీ ఫ్రీ స్కీమ్ ప్రభావమే అని అంటున్నారు. 

హైదరాబాద్ : తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు, మూడు రోజుల్లోనే ఈ పథకాన్ని అమలు చేశారు. దీంతో బస్సుల్లో మహిళల రద్దీ పెరిగింది. రాజధాని హైదరాబాద్ లో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునేవారి సంఖ్య బాగా పెరిగింది. దీంతో మెట్రోల్లో రద్దీ తగ్గింది. ఎక్కువగా పురుషులే కనిపిస్తున్నారు. 

మెట్రో స్టేషన్స్, ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్స్ దగ్గర మహిళల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఉచిత బస్సు ప్రయాణాన్ని వాడుకోవడం ద్వారా నెలకు పదిహేనువందల వరకు ఆదా చేసుకోవచ్చని అంటున్నారు మహిళలు. దీంతో రైళ్లల్లో మహిళల సంఖ్య తగ్గడంతో మొత్తం పురుషులే కనిపిస్తున్నారు. మహిళలు లేకపోవడంతో సీట్లు కూడా దొరుకుతున్నాయని పురుషులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

చంచల్ గూడా జైలుకు పల్లవి ప్రశాంత్

మరోవైపు నాన్ పీక్ అవర్స్ లో మెట్రో రైళ్లు ఖాళీగా కూడా ఉంటున్నాయి. ఉదయం, సాయంత్రాలు మాతమ్రే మెట్రోలు ఫుల్ అవుతున్నాయి. ఇది ఆర్టీసీ ఫ్రీ స్కీమ్ ప్రభావమే అని అంటున్నారు. ఆర్టీసీ ఫ్రీ స్కీం రాకముందు ఐదు లక్షల వరకు మెట్రో రైడర్ షిప్ నమోదయ్యేది. బస్సుల్లో మహిళలకు ఫ్రీ సదుపాయంతో మెట్రోలో ప్రయాణించే మహిళలు ఆర్టీసీ వైపు మొగ్గు చూపుతున్నారు. 

మరికొందరు మహిళలు మెట్రో స్టేషన్స్ వరకు చేరుకోవడానికి, అక్కడినుంచి ఆఫీసులకు వెళ్లడానికి ఈ ఫ్రీ బస్సు ప్రయాణాన్ని వాడుకుంటున్నారు. ఏదేమైనా మెట్రోలో మాత్రం మహిళల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఎక్కడ చూసినా పురుషులే కనిపిస్తున్నారు. దీంతో సీట్ల కోసం గొడవలు, సిగపట్లు తగ్గాయని కూడా సరదాగా కామెంట్ చేస్తున్నారు. 

click me!