Rythu Bandhu: రైతు బంధు కింద ఆ రైతన్న ఖాతాలో రూ. 1 జమ.. కలవరంలో రైతు

By Mahesh K  |  First Published Dec 19, 2023, 3:19 PM IST

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని ఓ రైతు ఖాతాలో రైతు బంధు పెట్టుబడి సాయంగా ఒక్క రూపాయి జమ అయింది. ఈ మెస్సేజీ చూసి ఆయన ఖంగుతిన్నాడు.
 


Rythu Bandhu: రైతు బంధు కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. కొందరు రైతులు మాత్రం ఈ డబ్బులు చూసి ఖంగుతిన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలో ఓ రైతుకు తన ఖాతాలో రూ. 1 జమ అయినట్టు వచ్చిన మెస్సేజీ చూసి అవాక్కయ్యాడు. 

యాసంగి సీజన్ కోసం రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గత సోమవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐదు ఎకరాలకు లోపున్న వారికి రైతు బంధు డబ్బులు పడుతున్నాయి. అయితే, హన్వాడ మండలానికి చెందిన పాండురంగా రెడ్డి మాత్రం రైతు బంధు డబ్బులతో షాక్ అయ్యాడు. రైతు బంధు పెట్టుబడి సాయంగా రూ.1 తన ఖాతాలో జమ అయినట్టు మెస్సేజీ వచ్చింది. గతంలో ఆయనకు రెండు సీజన్లకు కలిపి ఎకరాకు రూ.10 వేలు తన ఖాతాలో జమ అయ్యేవి. కానీ, ఈ సారి కేవలం రూపాయి మాత్రమే పడింది.

Latest Videos

‘నాకు ఐదు ఎకరాల భూమి ఉన్నది. రైతు బంధు సాయంగా రూ. 1 మాత్రమే నా ఖాతాలో జమ అయ్యాయి. ఇదే తీరులో అదే మండలం తంకారా గ్రామంలో కూడా ఓ రైతుకు రూ. 62 ఖాతాలో డిపాజిట్ అయ్యాయి.

Also Read: రేవంత్ సర్కార్ కు విచిత్ర పరిస్థితి ... ఎన్నికల హామీ అమలుచేస్తుంటే ఆందోళనలు..!

ఆంజనేయులుకు రెండు గుంటల భూమి ఉన్నది. గతంలో ఆయనకు రూ. 250 సాయంగా పడేవి. ఇప్పుడు మాత్రం రూ. 62 పడ్డాయి. మరో సర్వే నెంబర్ పై ఆంజనేయులకు 1.5 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమికి సంబంధించి ఇంకా రైతు బంధు డబ్బులు పడలేవు. ఇంకా ఎప్పుడు పడతాయో అనే భయాలు ఉన్నాయి.

click me!