మహబూబాబాద్‌లో టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోతు రవి హత్య: 24 గంటల్లో నిందితుల అరెస్ట్

By narsimha lode  |  First Published Apr 22, 2022, 4:49 PM IST

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవి నాయక్ హత్య కేసులో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమవ్యాపారాలను అడ్డుకొంటున్నందుకే రవిని హత్య చేశారని పోలీసులు తెలిపారు.


మహబూబాబాద్: Mahabubabad  మున్సిపాలిటీలో 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవి నాయక్ హత్య కేసులో తొమ్మిది మందిని పోలీసులు  శుక్రవారం నాడు  Arrest చేశారు. ఈ హత్యకు రాజకీయ పరమైన కారణాలు లేవని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తేల్చి చెప్పారు.

మహబూబాబాద్ లోని పత్తిపాక నుండి Banoth Ravi Naik  బైక్ పై వస్తున్న సమయంలోనే ట్రాక్టర్ ను అడ్డు పెట్టి  రవిని ప్రత్యర్ధులు గొడ్డలితో నరికి చంపారు. అక్రమ వ్యాపారాలను అడ్డుకొంటున్నాడనే అక్కసుతోనే రవిని హత్య చేసినట్టుగా నిందితులు ఒప్పుకొన్నారని పోలీసులు చెప్పారు. గతంలో ఈ అక్రమ వ్యాపారాల్లో రవి కూడా భాగస్వామిగా ఉన్నాడు. కలప, బియ్యం, ఇసుక అక్రమంగా తరలించేవారు. బానోతు రవి, విజయ్, అరుణ్ లు  ఈ వ్యాపారం నిర్వహించేవారు. అయితే  వీరి మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో విజయ్, అరుణ్ లు వ్యాపారం నిర్వహిస్తున్నారు.అయితే విజయ్, అరుణ్ లు ఈ అక్రమ వ్యాపారాలు నిర్వహించకుండా బానోతు రవి అడ్డుపడుతున్నాడు. ఇటీవలనే ఓ Lorry  లోడు కలపను రవి పోలీసులకు పట్టించాడు. దీంతో కక్ష పెంచుకొన్నArun, Vijayలు  రవిని చంపాలని ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు.  రవిని హత్య చేసేందుకు మరో ఏడుగురి సహాయం కూడా తీసుకొన్నారు.భూక్యా వినయ్, భూక్యా అరుణ్, అజ్మీరా బాలరాజు, గగులోత్, చింటూ, కారపాటి సుమంత్, అజ్మీరా కుమార్, గగులోత్ బాపుసింగ్ లు అరుణ్, విజయ్ లకు సహకరించినట్టుగా పోలీసులు తెలిపారు.

Latest Videos

రవి కదలికలపై నిఘా ఏర్పాటు చేసిన అరుణ్, విజయ్ పత్తిపాక నుండి ఒంటరిగా వెళ్తున్న రవిని చంపాలని నిర్ణయం తీసుకొన్నారని చెప్పారు. ట్రాక్టర్ ను అడ్డు పెట్టి రవిపై గొడ్డలితో దాడికి దిగినట్టుగా పోలీసులు తెలిపారు.నిందితుల నుండి గొడ్డలి, తల్వార్, ట్రాక్టర్, కారు స్వాధీనం చేసుకొన్నారు.

మహబూబాబాద్ లో గురువారం నాడు టీఆర్ఎస్ కౌన్సిలర్ రవిని దుండగులు హత్య చేశారు. తనకు ప్రాణహాని ఉందని రవి గతంలో  స్నేహితులకు చెప్పారు.  రవినాయక్ కు భార్య ముగ్గురు పిల్లలున్నారు.  దుండగులు గొడ్డలితో దాడి చేసిన తర్వాత కొనఊపిరితో ఉన్న  రవి నాయక్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రవి నాయక్ మరణించినట్టుగా వైద్యులు చెప్పారు. 
 

click me!