మల్కాజిగిరిలో గుడికి వెళ్లిన మహిళ హత్య: నగల కోసం పూజారే హత్య చేసినట్టు గుర్తింపు

Published : Apr 22, 2022, 04:01 PM IST
మల్కాజిగిరిలో గుడికి వెళ్లిన మహిళ హత్య: నగల కోసం పూజారే హత్య చేసినట్టు గుర్తింపు

సారాంశం

 మల్కాజిగిరిలో గుడికి వెళ్లి అదృశ్యమైన ఉమాదేవి హత్యకు గురైంది. మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. మహిళ ఒంటిపై ఉన్న నగల కోసమే పూజారి మురళి హత్య చేసినట్టుగా పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: గుడికి వెళ్లి అదృశ్యమైన Uma Devi హత్యకు గురైంది.  మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. మహిళ ఒంటిపై ఉన్న నగల కోసమే ఆమెను హత్య చేశారని పోలీసులు గుర్తించారు.

Malkajgiriలో ఈ నెల 18న ఉమాదేవి Templeకి వెళ్లింది.  అయితే గుడికి వెళ్లిన ఉమాదేవి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె భర్త మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుడి సమీపంలో ఉన్న CCTV పుటేజీని పరిశీలించి నిందితుడిని అరెస్ట్ చేశారు.
గుడికి వెళ్లిన ఉమాదేవి నగలపై కన్నేసిన Priest మురళే ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు మురళిని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు.

మల్కాజిగిరిలోని విష్ణుపురి ఎక్స్‌టెన్షన్‌ కాలనీలో ఈనెల 18న  ఉమాదేవి  అదృశ్యమైంది. ఆమె మృతదేహం గురువారం కాలనీలోని స్వయంభూ సిద్ది వినాయకస్వామి ఆలయం వెనుక లభ్యమైంది.మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అదృశ్యమైన రోజునే ఉమాదేవిని హతమార్చి ఆమె ఒంటిపై ఉన్న సుమారు 10 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. ఉమాదేవి భర్త జీవీఎన్‌.మూర్తి రైల్వేలో ఉద్యోగం చేస్తూ వీఆర్ఎస్ తీసుకున్నారు.  వీరికి ఇద్దరు పిల్లలు. ఉమాదేవి కొుడకు  ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. 

కూతురి  వివాహం గత నెల 27న జరిపించారు. ఉమాదేవి రోజూ  తమ ఇంటికి దగ్గర్లోని స్వయంభూ సిద్ది వినాయకస్వామి ఆలయానికి, విష్ణుపురిలోని శివాలయానికి వెళుతుంది. ఈనెల 18న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో మూర్తి తన భార్య ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం ఆలయం వెనుక మృతదేహం లభ్యమైంది.

ఉమాదేవి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆదే రోజు సాయంత్రం ఆమె భర్త స్వయంభూ దేవాలయం వద్దకు వెళ్లి పూజారిని ఆరా తీశాడు. ఆలయానికి వచ్చి వెళ్లినట్లు చెప్పాడు. అయితే అప్పటికే గుడిని శుభ్రం చేసి తాళాలు వేసి ఉండటంపై ప్రశ్నించగా పిల్లి చనిపోతే శుభ్రం చేసినట్లు పూజారి సమాధానం చెప్పాడని ఆమె స్నేహితులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Renu Desai Fire on Media: మీడియా పైరెచ్చిపోయిన రేణు దేశాయ్ | Asianet News Telugu
Renu Desai Strong Comments On Street Dogs: కుక్కల మరణాలపై రేణు దేశాయ్ ఉగ్రరూపం | Asianet News Telugu