మహా కూటమి: 25 సీట్లు టీడీపీ టార్గెట్, అభ్యర్థులు వీరే...

By pratap reddyFirst Published Sep 22, 2018, 11:44 AM IST
Highlights

గెలిచే స్థానాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలనే అవగాహనలో భాగంగా తెలుగుదేశం పార్టీ 25 స్థానాలు తమకు ఇవ్వాలని కాంగ్రెసు పార్టీని కోరుతోంది. వీటిలో 19 స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసింది.

హైదరాబాద్: మహా కూటమిలో సీట్ల పంపకంపై కూడా చర్చలు ప్రారంభమయ్యాయి. గెలిచే స్థానాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలనే అవగాహనలో భాగంగా తెలుగుదేశం పార్టీ 25 స్థానాలు తమకు ఇవ్వాలని కాంగ్రెసు పార్టీని కోరుతోంది. వీటిలో 19 స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసింది.

తమ పార్టీ తరఫున పోటీ చేసే నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమర్పించే పనిలో పడింది. ఇప్పటి వరకు 19 మంది అభ్యర్థుల జాబితాను తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమర్పించినట్లు తెలుస్తోంది. ఆ అభ్యర్థుల జాబితా ఇలా ఉంది...

దేవరకద్ర - రావుల చంద్రశేఖర రెడ్డి
మక్తల్ - కొత్తకోట దయాకర్ రెడ్డి
మహబూబ్ నగర్ - చంద్రశేఖర్
రాజేంద్ర నగర్ - ఎం. భూపాల్ రెడ్డి
శేర్ లింగంపల్లి - మండవ వెంకటేశ్వర రావు లేదా మొవ్వా సత్యనారాయణ
కూకట్ పల్లి - శ్రీనివాస రావు
సికింద్రబాద్ - కూన వెంకటేష్ గౌడ్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ - ఎంఎన్ శ్రీనివాస రావు
ఖైరతాబాద్ - బిఎన్ రెడ్డి
ఉప్పల్ - వీరేందర్ గౌడ్ (దేవేందర్ గౌడ్ కుమారుడు)
కోరుట్ల - ఎల్. రమణ
హుజూరాబాద్ - ఇనగాల పెద్దిరెడ్డి
ఆర్మూర్ - అన్నపూర్ణ
పరకాల లేదా వరంగల్ వెస్ట్ - రేవూరి ప్రకాశ్ రెడ్డి
ఆలేరు - శోభారాణి 
కోదాడ - బొల్లం మల్లయ్య యాదవ్ (ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు)
మిర్యాలగుడా - శ్రీనివాస్
ఖమ్మం - నామా నాగేశ్వర రావు
సత్తుపల్లి - సండ్ర వెంకటవీరయ్య

అయితే, తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు మాత్రమే ఇవ్వడానికి కాంగ్రెసు పార్టీ సుముఖత వ్యక్తం చేస్తోంది. కాస్తా అటూ ఇటుగా సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య అవగాహన కుదరవచ్చు. ఇకపోతే, కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జనసమితి (టీజెఎస్) 15 సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. సిపిఐకి కూడా కొన్ని సీట్లు కేటాయించాల్సి వస్తుంది. ఈ రెండు పార్టీలకు కలిపి 12 సీట్లు ఇవ్వడానికి కాంగ్రెసు ముందుకు వస్తున్నట్లు సమాచారం. 

click me!
Last Updated Sep 22, 2018, 11:44 AM IST
click me!