మధులికకు బ్రెయిన్ సర్జరీ అవసరం: యశోద వైద్యులు

By pratap reddyFirst Published Feb 7, 2019, 2:26 PM IST
Highlights

హైదరాబాదులోని బర్కత్ పురాలో మధులికపై ప్రేమోన్మాది దాడి చేసిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఇంకా వెంటిలేటర్ పై ఉండడంతో ఆరోగ్యం గురించి పూర్తిగా చెప్పలేమని వైద్యులన్నారు.

హైదరాబాద్: ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఇంటర్మీడియట్ విద్యార్థిని మధులికకు బ్రెయిన్ సర్జరీ అవసరమని యశోదా ఆస్పత్రి వైద్యులు చెప్పారు. దాడిలో మెదడుకు గాయయమైందని, ఎంఆర్ఐ స్కాన్ లో ఆ విషయం తేలిందని వారు చెప్పారు.

హైదరాబాదులోని బర్కత్ పురాలో మధులికపై ప్రేమోన్మాది దాడి చేసిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఇంకా వెంటిలేటర్ పై ఉండడంతో ఆరోగ్యం గురించి పూర్తిగా చెప్పలేమని వైద్యులన్నారు. దాడికి వాడిన కత్తి తుప్పు పట్టి ఉందని, దానివల్ల ఇన్ ఫెక్షన్ ఆమె శరీరభాగాలకు పాకే ప్రమాదం ఉందని వారన్నారు. 

మధులిక ఆరోగ్య పరిస్థితి నిన్నటి కన్నా కాస్తా మెరుగ్గా ఉన్నప్పటికీ ఆందోళకరంగానే ఉందని, మరో 24 గంటలు పోతే గానీ ఏదీ చెప్పలేమని వారన్నారు. ఆమెకు అవసరమైన సర్జరీలు చేయాల్సి ఉందని వారు చెప్పారు. 

సంబంధిత వార్తలు

ప్రేమోన్మాది దాడి: 14 చోట్ల దిగిన కత్తి, ఆగని రక్తస్రావం

మధులికపై ప్రేమోన్మాది దాడి: రెండు రోజుల ముందు కత్తి దొంగిలించి...

మధులికపై దాడి చేసిన భరత్ అరెస్ట్

మధులిక పరిస్థితి విషమం: 72 గంటలు అబ్జర్వేషన్

హైదరాబాద్‌లో నడిరోడ్డు మీద యువతిపై ప్రేమోన్మాది దాడి

click me!