కోడలికి వివాహేతర సంబంధం అంటగట్టిన మామ.. తట్టుకోలేక ఆమె చేసిన పని..

By AN TeluguFirst Published Dec 1, 2021, 3:04 PM IST
Highlights

మామ బతికి ఉంటే ఎప్పుడూ ఇలాగే తనను Suspicionతో వేధిస్తాడని, ఆస్తి కూడా తనకు దక్కదని భావించింది. తన అక్క కొడుకు, మానకొండూర్ మండలం కల్లెడకు చెందిన ప్రవీణ్ లో కలిసి కనకయ్యను చంపేందుకు ప్లాన్ వేసింది. ఈ ప్లాన్ ప్రకారం రోజూలాగే తాగి వచ్చి కోడలితో గొడవపడి.. నిద్రిస్తున్న కనకయ్యను కర్రతో విచక్షణారహితంగా కొట్టి, గొంతుకు తాడు బిగించి, బలంగా లాగడంతో మృతి చెందాడు. 

కరీంనగర్ : ఓ మామ కోడలి మీద పగబట్టాడు. ఆమెను చెడుగా నిరూపించాలని కంకణం కట్టుకున్నాడు. Extramarital affair పెట్టుకుందని నిత్యం ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. అది సరికాదని Daughter-in-law ఎన్నిసార్లు చెప్పినా మానలేదు. మారలేదు. దీంతో కోడలు విసుగు చెందింది. దీనికి పరిష్కారం మామ చనిపోవడమే అని నిర్ణయించుకుంది. 

తన అక్క కొడుకుతో కలిసి మామను అంతమొందించింది. గత నెల 27న కాచాపూర్ లో మాతంగి కనకయ్య (70) హత్యకు గురయ్యాడు. అయితే చంపింది కోడలేనని హుజూరాబాద్ ఏసీపీ వెంకట్ రెడ్డి తాజాగా తెలిపారు. కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో మంగళవారం murder caseకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కనకయ్య భార్య, కుమారుడు గతంలోనే మృతి చెందారు. 

అయితే కనకయ్యకు వయసు మీద పడిందే కానీ.. అనుమానం పిశాచం వదలలేదు. నిత్యం మద్యం సేవించేవాడు. ఆ తరువాత కోడలు కొంరమ్మకు మరో వ్యక్తితో Illegal relationship ఉందని అనుమానించేవాడు. అంతేకాదు తనకు తిండి పెట్టడం లేదని తిడుతూ శాపనార్థాలు పెట్టేవాడు. ఇదే విషయంలో ఈ నెల 27న రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పదే పదే ఇలాగే వేధిస్తుండడంతో కొంరమ్మ విసుగు చెందింది. 

ముసలోడు బతికి ఉంటే ఎప్పుడూ ఇలాగే తనను Suspicionతో వేధిస్తాడని, ఆస్తి కూడా తనకు దక్కదని భావించింది. తన అక్క కొడుకు, మానకొండూర్ మండలం కల్లెడకు చెందిన ప్రవీణ్ లో కలిసి కనకయ్యను చంపేందుకు ప్లాన్ వేసింది. ఈ ప్లాన్ ప్రకారం రోజూలాగే తాగి వచ్చి కోడలితో గొడవపడి.. నిద్రిస్తున్న కనకయ్యను కర్రతో విచక్షణారహితంగా కొట్టి, గొంతుకు తాడు బిగించి, బలంగా లాగడంతో మృతి చెందాడు. 

అయితే కనకయ్య కూతురు ఫిర్యాదు మేరకు కొంరమ్మ, ప్రవీణ్ లపై హుజూరాబాద్ రూరల్ సీఐ కిరణ్, ఎస్సై ప్రశాంత్ రావులు కేసు నమోదు చేశారు. నిందితులను విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. దీంతో వారిని రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. హత్య కేసును ఛేదించిన సీఐ, ఎస్సైలను ఏసీపీ అభినందించారు. 

TSRTC Bus fare hike: తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ బస్సు చార్జీలు.. కిలో మీటర్‌కు ఎంత పెంచనున్నారంటే..!

ఇదిలా ఉండగా.. ఇలాంటి దారుణమే మహబూబ్ నగర్ లో జరిగింది. క్షణికావేశంలో భార్య చేసిన దాడిలో భర్త మృతి చెందాడు. ఈ ఘటన Nagar Kurnool జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. లత్తీపూర్ గ్రామానకి చెందిన మూడవత్ ఈర్యా నాయక్ (55), ద్వాలీ దంపతులు. వీరి కుమారుడు, కోడలికి కొంతకాలం క్రితం  Conflicts వచ్చాయి. 

దీంతో కోడలు పుట్టింటికి వెళ్లింది. ఎన్నిసార్లు అడిగినా రావడం లేదు. ఈ విషయం మీద మంగళవారం కల్వకుర్తి పట్టణంలో పంచాయతీ ఉండగా ఈర్యా నాయక్, ద్వాలీ కలిసి వెళ్లాల్సి ఉంది. కాగా, పక్క ఊరికి వెళ్లిన భర్త ఈర్యా నాయక్ సకాలంలో ఇంటికి రాలేదు. దీంతో ఈర్యా నాయక్ రాగానే పంచాయతీకి వెళ్లాల్సి ఉందని భార్య గొడవకు దిగింది. 

దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరగింది. ఆ గొడవతో ద్యాలీ తీవ్ర ఆవేశానికి గురైంది. పక్కనే ఉన్న Stickతో భర్త ఈర్యా నాయక్ headమీద కొట్టగా.. తీవ్రంగా గాయపడిన ఈర్యా నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో. అచ్చంపేట సీఐ అనుదీప్, ఎస్సై రమేష్ అజ్మీరా ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈర్యా నాయక్ సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 
 

click me!