మంత్రి తలసానిని కలిసిన మాధవి దంపతులు

By Nagaraju TFirst Published Oct 21, 2018, 11:22 AM IST
Highlights

ప్రేమ వివాహం చేసుకుని తండ్రి చేతిలో కత్తిపోట్లకు గురై కోలుకున్న మాధవి తన భర్తతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసింది. ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో తండ్రి మనోహరాచారి మాధవిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన మాధవి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యింది.  

హైదరాబాద్: ప్రేమ వివాహం చేసుకుని తండ్రి చేతిలో కత్తిపోట్లకు గురై కోలుకున్న మాధవి తన భర్తతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసింది. ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో తండ్రి మనోహరాచారి మాధవిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన మాధవి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యింది.  

డిశ్చార్జ్ అయిన తర్వాత మాధవి తన భర్త, కుటుంబ సభ్యులతో కలిసి మారేడుమిల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తాను కోలుకోవడానికి ప్రభుత్వం అందించిన సహాయమే కారణమని మాధవి తెలిపింది. 

తనపై దాడి జరిగిన వెంటనే మంత్రి తలసాని హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని తనను మెరుగైన చికిత్స కోసం యశోద ఆసుపత్రిలో చేర్పించడంతో పాటు చికిత్సకు అవసరమైన రూ.8.35 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పించారని తెలిపారు. తనకు పునర్జన్మనిచ్చిన ప్రభుత్వానికి, తలసానికి రుణపడి ఉంటానని మాధవి అన్నారు. 

click me!