గెలిచే అవకాశం ఉంది, కష్టపడండి: నేతలకు రాహుల్ హితబోధ

Published : Oct 20, 2018, 09:24 PM IST
గెలిచే అవకాశం ఉంది, కష్టపడండి: నేతలకు రాహుల్ హితబోధ

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమికి గెలిచే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం పూర్తైన తర్వాత ఢిల్లీ వెళ్లే సమయంలో బేగంపేటలోని ఎన్నికల కమిటీతో భేటీ అయ్యారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమికి గెలిచే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం పూర్తైన తర్వాత ఢిల్లీ వెళ్లే సమయంలో బేగంపేటలోని ఎన్నికల కమిటీతో భేటీ అయ్యారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు.  కష్టపడితే గెలిచే అవకాశాలు ఉన్నాయని అంతా కలిసి పనిచేయాలని సూచించారు. 

పార్టీలో అందరికి సమాన ప్రాధాన్యత ఉంటుందని రాహుల్ స్పష్టం చేశారు. పార్టీకి నష్టం వాటిల్లకుండా సీట్ల సర్దుబాటు రాష్ట్ర నేతలే చూసుకోవాలని తేల్చిచెప్పారు. గెలిచే అవకాశాలున్నచోట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే బరిలోకి దించాలని సూచించారు. అలాగే పొత్తుల అంశాన్ని కూడా రాహుల్ గాంధీ రాష్ట్ర నేతలకే వదిలేశారు. 

మరోవైపు నల్గొండ, ఖమ్మం జిల్లాలో పర్యటించాలని పలువురు నేతలు రాహుల్ గాంధీని కోరారు. నేతల కోరికపై రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందిచారు. దీంతో త్వరలోనే రాహుల్ గాంధీ పర్యటన ఉండబోతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌