రాహుల్ పర్యటనలో బయటపడ్డ విబేధాలు

By Nagaraju TFirst Published Oct 20, 2018, 8:55 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనలో కాంగ్రెస్ నేతల మధ్య బేదాభిప్రాయాలు బయటపడ్డాయి. ఎన్నికల పర్యటన పూర్తైన తర్వాత బేగంపేట విమానాశ్రయంలో రాహుల్ గాంధీ ఎన్నికల కమిటీతో సమావేశమయ్యారు. ప్రజాకూటమిలో సీట్ల సర్ధుబాటుపై నేతలతో చర్చించారు రాహుల్. అయితే సమావేశం మధ్యలోనే కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి బయటకు వచ్చేశారు. 

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనలో కాంగ్రెస్ నేతల మధ్య బేదాభిప్రాయాలు బయటపడ్డాయి. ఎన్నికల పర్యటన పూర్తైన తర్వాత బేగంపేట విమానాశ్రయంలో రాహుల్ గాంధీ ఎన్నికల కమిటీతో సమావేశమయ్యారు. ప్రజాకూటమిలో సీట్ల సర్ధుబాటుపై నేతలతో చర్చించారు రాహుల్. అయితే సమావేశం మధ్యలోనే కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి బయటకు వచ్చేశారు. 

గత కొన్నేళ్లుగా రాజీవ్ సద్భావన యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తనను రాజీవ్ సద్భావన యాత్రకు పిలవలేదని తన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాను అడిగారు. పొంగులేటి సుధాకర్ రెడ్డిని ఎందుకు పిలవలేదంటూ ఆరా తీశారు. ఈ సందర్భంగా సీట్ల సర్ధుబాటుపై పొంగులేటి తన అభిప్రాయాన్ని రాహుల్ గాంధీకి చెప్పుకొచ్చారు. 

గతంలో పొత్తుల వల్ల ఖమ్మం జిల్లాలో తీవ్రంగా నష్టపోయామని ఈసారి జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అలాగే తాను ఢిల్లీ వచ్చి కలుస్తానని రాహుల్ గాంధీకి చెప్పి బయటకు వచ్చేశారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ బేగంపేట విమానాశ్రయం దగ్గర ఆందోళన చేశారు. 

స్ట్రాటజీ ప్లానింగ్ వైస్ చైర్మన్ గా ఉన్న తాను లేకుండా అప్పుడే మీటింగ్ అయిపోవడం ఏంటని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అవసరం లేదా అంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలదీశారు. 

click me!