రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి

By Arun Kumar PFirst Published Sep 20, 2018, 7:08 PM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ముందుకు వెళుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించి క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని  మొదలుపెట్టడంతో కాంగ్రెస్ కూడా వేగాన్ని పెంచింది. తాజాగా ఎన్నికల కోసం టిపిసిసి కమిటీలను ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీలే ఇపుడు కాంగ్రెస్ నాయకులు మధ్య తాజా వివాదానికి  కారణమవుతున్నాయి. ఇందులో ప్రాధాన్యత గల పదవులు దక్కకపోవడంతో ఇప్పటికే కొందరు కాంగ్రెస్ సీనియర్లు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లగక్కిన విషయం తెలిసిందే. తాజాగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ కమిటీలపై విమర్శల వర్షం కురింపించాడు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని పరోక్ష విమర్శలు చేశారు.

గాంధీ భవన్ లో కూర్చుని నిర్ణయాలు తీసుకోవడం మానాలని...ప్రజల్లోకి వెళ్లి ఏ నాయకుడికి ఎంత బలముందో తెలుసుకుంటే మంచిదని రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు. నిన్న, మొన్న పార్టీలో చేరిన వారికి కూడా ఈ కమిటీల్లో అధిక ప్రాధాన్యత కల్పించారని ఆరోపించారు. జైళ్లకు వెళ్లొచ్చిన వారికి పదవులు ఇవ్వడం ఏంటంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డిపై ద్వజమెత్తారు. 

పార్టీ అధినాయకత్వం ఇకనైనా ప్రజల్లో పలుకుబడి, బలం వున్న నాయకులకు గుర్తింపు ఇస్తే బావుంటుందని రాజగోపాల్ రెడ్డి హితవు పలికారు. వార్డు మెంబర్లుగా కూడా గెలిచే సత్తా లేనివారికి కూడా ఇంత ప్రాధాన్యమైన పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల అండదండలతో పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నవారికి మాత్రం అన్యాయం జరిగిందని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

టీపీసీసీ కొత్త కమిటీల ఎఫెక్ట్: ట్విస్టిచ్చిన సుధీర్ రెడ్డి

రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లో నిరసన సెగ

ఎన్నికల కమిటీలు: కాంగ్రెస్‌లో ఇక రేవంత్ జోరు

తెలంగాణకు కుంతియా శనిలా దాపురించాడు : కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

click me!
Last Updated Sep 20, 2018, 8:04 PM IST
click me!