సీఎం రేసులో లేను: కోమటిరెడ్డి

Published : Sep 20, 2018, 04:19 PM ISTUpdated : Sep 20, 2018, 04:28 PM IST
సీఎం రేసులో లేను: కోమటిరెడ్డి

సారాంశం

నల్గొండ నుండే టీఆర్ఎస్ పతనం ప్రారంభం కానుందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు.


నల్గొండ: నల్గొండ నుండే టీఆర్ఎస్ పతనం ప్రారంభం కానుందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు.తాను సీఎం రేసులో లేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

గురువారం నాడు ఆయన  మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు శక్తి వంచనలేకుండా కృషి చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉంటానని చెప్పారు.

 ప్రజా మేనిఫెస్టో రూపొందించడమే తన లక్ష్యమని ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలతో చర్చిస్తామని తెలిపారు. కేసీఆర్‌ అన్నివర్గాల ప్రజలను మభ్యపెట్టి మేనిఫెస్టో తయారు చేశారని ఆరోపించారు. 

మహా కూటమి వల్ల సీట్ల సర్దుబాటులో ఎలాంటి ఇబ్బందులుండవన్నారు. గెలిచే స్థానాలన్నీ కాంగ్రెస్‌‌కే ఉంటాయని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.నేరగాళ్లందరికీ టీఆర్ఎస్‌లో టిక్కెట్లను కేటాయించినట్టు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.


 

PREV
click me!

Recommended Stories

Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu
Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?