తెలంగాణ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ... టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న నాగర్ కర్నూల్ నేత

By Arun Kumar PFirst Published Sep 4, 2018, 8:07 PM IST
Highlights

తెలంగాణ లో ముందస్తు ఎన్నికలకు అధికార టీఆర్ఎస్ పార్టీ రంగం సిద్దం చేసింది. ఇందుకోసం ఇప్పటికే తన బలాన్ని ప్రతిపక్షాలకు తెలియజేయడానికి భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ముందుకు వెళుతోంది. అంతేకాకుండా ప్రతిపక్షాల బలాన్ని తగ్గించడానికి కూడా టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం టీఆర్ఎస్ నాయకులు ఆపరేషన్ ఆకర్ష్ బాట పట్టారు. అందులో భాగంగా ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడితో పాటు పలువురి కార్యకర్తలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు.

నాగర్ కర్నూల్ జిల్లా మాచారం మండల పరిషత్ ప్రెసిడెంట్(ఎంపిపి) గా కాంగ్రెస్ పార్టీ నుండి ప్రాతినిద్యం వహిస్తున్న ఎల్.నర్సింగరావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాడు. ఇవాళ తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ మంత్రి నర్సింగ రావుతో పాటు పలువురు నాయకులను గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ...టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం పెంచుకున్నంత మాత్రాన గబ్బర్ సింగ్ కాలేడని మరోసారి విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోందని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చనిపోవడంతో జరిగిన ఉపఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారని గుర్తు చేశారు. తనను తాను గెలిపించుకోలేని రాహుల్ గాంధి తెలంగాణలో ఏదో పొడిచేస్తాడని కాంగ్రెస్ నాయకులు భావించడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ ఎద్దెవా చేశారు.
  
click me!