హైదరాబాద్ చేరుకున్న స్వామి పరిపూర్ణానంద ధర్మజ్వాల ర్యాలీ

By rajesh yFirst Published Sep 4, 2018, 7:29 PM IST
Highlights

స్వామి పరిపూర్ణానంద తలపెట్టిన ధర్మజ్వాల ర్యాలీ హైదరాబాద్ నగరానికి చేరుకుంది. హైదరాబాద్ నగర బహిష్కరణను హైకోర్టు ఎత్తివేయడంతో స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ తొలిసారిగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో స్వామి పరిపూర్ణానందకు అడుగడుగున భక్తులు ఘనస్వాగతం పలికారు. ధర్మజ్వాల ర్యాలీ ద్విచక్రవాహనాలు, కార్లతో నిర్వహించడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. వేలాది వాహనాలు నిలిచిపోయాయి. 

హైదరాబాద్‌: స్వామి పరిపూర్ణానంద తలపెట్టిన ధర్మజ్వాల ర్యాలీ హైదరాబాద్ నగరానికి చేరుకుంది. హైదరాబాద్ నగర బహిష్కరణను హైకోర్టు ఎత్తివేయడంతో స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ తొలిసారిగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో స్వామి పరిపూర్ణానందకు అడుగడుగున భక్తులు ఘనస్వాగతం పలికారు. ధర్మజ్వాల ర్యాలీ ద్విచక్రవాహనాలు, కార్లతో నిర్వహించడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. వేలాది వాహనాలు నిలిచిపోయాయి. 

విధులు ముగించుకుని ఉద్యోగులు ఇళ్లకు చేరుకునే సమయంలో ర్యాలీ నగరంలోకి అడుగుపెట్టడంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు వీహెచ్ పీ, బీజేపీ నేతలు ప్రతీ జంక్షన్ వద్ద ఘనస్వాగతాలు పలికారు. పరిపూర్ణానందకు పూలమాలలు వేసి ఆశీస్సులు అందుకున్నారు. 

ధర్మజ్వాల ర్యాలీ సందర్భంగా అబ్దుల్లాపూర్‌మెట్‌, పెద్ద అంబర్‌పేట్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. ట్రాఫిక్‌లో అంబులెన్స్‌లు కూడా చిక్కుకోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.  

మరోవైపు హైదరాబాద్ చేరుకున్న స్వామి పరిపూర్ణానందకు అబ్ధుల్లాపూర్ మెట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్వాగతం పలికారు. భారీగా ర్యాలీ వస్తుండటంతో బారికేడ్లను ఆయన అనుచరులు తొలగించారు. పరిపూర్ణానంద వెంట ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ ఉన్నారు. కాకినాడ నుంచి ప్రారంభమైన ధర్మజ్వాల ర్యాలీలో ఎన్వీఎస్ ప్రభాకర్ పరిపూర్ణానంద వెంట ఉన్నారు. 
 

ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏడు వాహనాల్లో పోలీసులు స్వామి పరిపూర్ణానంద ర్యాలీని పర్యవేక్షిస్తున్నారు.

 

"

click me!