నేటి నుంచి సాగర్‌, శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం...

By AN TeluguFirst Published Nov 29, 2021, 12:27 PM IST
Highlights

నాగార్జునసాగర్‌, శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం సోమవారం ప్రారంభమవుతోంది. ప్రస్తుతం సాగర్‌ నీటిమట్టం 588.80 అడుగులు ఉండడంతో తెలంగాణ 
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ టూర్‌కు పచ్చజెండా ఊపింది. సోమవారం ఉదయం 9 గంటలకు సాగర్‌ నుంచి బయలుదేరే లాంచీ ప్రయాణం 3 గంటలకు శ్రీశైలానికి చేరుతుంది. 

నాగార్జునసాగర్‌, శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం సోమవారం ప్రారంభమవుతోంది. ప్రస్తుతం సాగర్‌ నీటిమట్టం 588.80 అడుగులు ఉండడంతో తెలంగాణ 
State Tourism Development Corporation ఈ టూర్‌కు పచ్చజెండా ఊపింది. సోమవారం ఉదయం 9 గంటలకు సాగర్‌ నుంచి బయలుదేరే Luncheon Travel 3 గంటలకు శ్రీశైలానికి చేరుతుంది. 

ఆ రాత్రి అక్కడే బసచేసి దైవ దర్శనం, దర్శనీయ స్థలాల సందర్శన తరువాత మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీశైలం నుంచి బయలుదేరుతుంది. సాయంత్రం 3 గంటలకు లాంచీ సాగర్‌కు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రయాణానికి ఆదివారం సాయంత్రం వరకు 60 టికెట్లు బుక్‌ అయినట్లు పేర్కొన్నారు. గరిష్ఠంగా 150 టికెట్లకు అవకాశం ఉంటుందని తెలిపారు*

ఇదిలా ఉండగా, నాగార్జున సాగర్‌, శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి నిలిపివేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను నవంబర్ 25న కేఆర్‌ఎంబీ ఆదేశించింది. ఈమేరకు ఇరు రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌ గురువారం లేఖ రాశారు. సాగు, తాగునీటి అవసరాల్లేకుండా విద్యుత్‌ ఉత్పత్తి చేశారని లేఖలో పేర్కొన్నారు. సముద్రంలోకి 55.96 టీఎంసీల నీరు వృథాగా పోతున్నాయని, దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటినిల్వ 94.91 టీఎంసీలకు పడిపోయిందని వెల్లడించింది. 

కాగా... తెలుగు రాష్ట్రాల మధ్య water disputesకు  సంబంధించి తెలంగాణ సీఎం kcr ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురువారం షెకావత్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై వివరణ ఇచ్చారు.  కేసీఆర్‌ ఇటీవల మీడియా సమావేశాల్లో నా పేరు ప్రస్తావించారని... కేసీఆర్‌ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని కేంద్ర మంత్రి చెప్పారు. 

అధికార టీఆర్ఎస్ పై పోటీ... కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ పై కేసు నమోదు

ప్రజలకు, దేశానికి నిజాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని.. తెలంగాణ- ఏపీ మధ్య నీటి పంపకాల కోసం కొత్త ట్రైబ్యునల్‌ కోసం సీఎం కేసీఆర్‌ అడిగారని గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై కేసీఆర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారని.. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని ఆయన గుర్తుచేశారు. పిటిషన్‌ వెనక్కి తీసుకోమని అడిగానని.. రెండ్రోజుల్లో పిటిషన్‌ వెనక్కి తీసుకుంటామని కేసీఆర్‌ అన్నారని కేంద్ర మంత్రి తెలిపారు. 

supreme court నుంచి కేసు వెనక్కి తీసుకునేందుకు 8 నెలలు పట్టిందని.. నెల రోజుల క్రితం పిటిషన్‌ వెనక్కి తీసుకునేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందన్నారు. అప్పటి నుంచి కేంద్రం నిర్వర్తించాల్సిన కార్యక్రమం మొదలైందని.. ఇద్దరు సీఎంలతో కలిసి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగిందని Gajendra Singh Shekhawat పేర్కొన్నారు. చాలా కాలం నుంచి జరగాల్సిన సమావేశాన్ని చొరవ తీసుకుని ఏర్పాటు చేశానని... ఏడేళ్లు ఆలస్యం కావడానికి తాను, కేంద్రం ఎలా బాధ్యత వహిస్తామని కేంద్ర మంత్రి  ప్రశ్నించారు. 

రెండు రాష్ట్రాలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయని... రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ప్రధాని కూడా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారని... పరిధి నోటిఫై కానంతవరకు బాధ్యత ఎలా కొనసాగిస్తారని షెకావత్ ప్రశ్నించారు. ఇద్దరు సీఎంలు ఒప్పుకున్న తర్వాతే .. బోర్డుల పరిధిని నోటిఫై చేశారని, తెలుగు రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారానికి ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. 

న్యాయ మంత్రిత్వశాఖ అభిప్రాయం అడిగామని.. దాని కోసం నిరీక్షిస్తున్నామని షెకావత్ చెప్పారు. అవకాశం ఉన్నంత మేర ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని.. ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్‌ ఇలా ఎలా మాట్లాడుతారని షెకావత్ ప్రశ్నించారు. కేసీఆర్‌ చేస్తున్నది అంతా ఒక డ్రామా అంటూ గజేంద్ర సింగ్ షెకావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

click me!