ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఒంగోలు నుండి వరంగల్ కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది
వరంగల్:ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం డీసీతండా వద్ద మంగళవారంనాడు జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డీసీ తండా వద్ద ఆగి ఉన్న లారీని కారుఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒంగోలు నుండి వరంగల్ కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.మృతులను కృష్ణారెడ్డి,వరలక్ష్మి,వెంకటసాయి రెడ్డిగా గుర్తించారు.మృతదేహలను వర్ధన్నపేట ఆసుపత్రికి తరలించారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహలను బంధువులకు అప్పగిస్తారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ అనేక ప్రమాదాలుచోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యం,అతి వేగం ప్రధాన కారణంగా పోలీసులుచెబుతున్నారు.అంతేకాదు రోడ్లపై సరైన హెచ్చరికలు లేకపోవడం కూడ కారణంగా చెబుతున్నారు.మరో వైపు రోడ్లు సరిగా లేకపోవడంతో కూడ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
undefined
alsoread:కర్ణాటకలోఘోర రోడ్డు ప్రమాదం:9 మంది మృతి,10మందికి గాయాలు
ఈ నెల 6వ తేదీన ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో 25 మంది గాయపడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.సిద్దిపేట జిల్లాలోని రాయపోల్ లో లారీ ఢీకొన్నప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు.ఈ ఘటన ఈ నెల 7వ తేదీన జరిగింది.ఈ నెల 5వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు.ఈ నెల 3వతేదీన సంగారెడ్డి జిల్లాలోని కన్సాన్ పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.