ఐదు నెలలైనా బిడ్డను చూడకుండానే...:కరోనాతో డాక్టర్ శారద సుమన్ మృతి

By narsimha lodeFirst Published Sep 7, 2021, 2:20 PM IST
Highlights

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలో గైనకాలజిస్టుగా పనిచేస్తున్న శారదా సుమన్  కరోనాతో హైద్రాబాద్ లో మరణించారు. కరోనా సమయంలో ఆమె రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలో ఏప్రిల్ లో కరోనా బారినపడ్డారు. ఆ సమయంలోనే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. ఊపిరితిత్తుల ట్రాన్స్ ప్లాంటేషన్ కు హైద్రాబాద్  లో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.


హైదరాబాద్:తన ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా రోగులకు సేవ చేసిన మహిళా డాక్టర్ కరోనాతో ఐదు మాసాలు పోరాడి మరణించింది. పుట్టిన బిడ్డను చూడకుండానే ఆమె కన్నుమూసింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డాక్టర్ శారదా సుమన్ లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో రెసిడెంట్ డాక్టర్ గా పనిచేసేది. ఆమె భర్త అజయ్ కూడా డాక్టరే. ఈ ఏడాది  కరోనా రెండో దశ సమయంలో ఆమె ఈ ఆసుపత్రిలో ఆమె ఎందరో కరోనా రోగులకు ధైర్యంగా వైద్య సేవలు అందించింది. ఆ సమయంలో ఆమె గర్భవతి. కరోనా జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ ఆమెకు ఈ ఏడాది ఏప్రిల్ 14 కరోనా సోకింది. దీంతో ఆమె కోవిడ్ చికిత్స తీసుకొంది. ఆమె కోలుకొన్నట్టుగానే కన్పించింది. కానీ ఆ తర్వాత ఆరోగ్యం విషమించింది.

ఈ ఏడాది మే 1న ఆమెకు అత్యవసరంగా సిజేరియన్ చేసి పురుడు పోశారు. అప్పటికే ఆమె ఆరోగ్యం విషమించింది. ఎక్మో సహయంతో ఆమెకు చికిత్స అందించారు. ఆమె ఊపిరితిత్తులు దెబ్బతినడంతో  విషయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. ఊపిరితిత్తుల మార్పిడి కోసం ఆమెను హైద్రాబాద్ కు తరలించారు. ఊపిరితిత్తుల మార్పిడికి అవసరమయ్యే ఖర్చును యూపీ ప్రభుత్వం భరిస్తామని హమీ ఇచ్చింది.

ఈ ఏడాది జూలై 11న ఆమెను లక్నో నుండి హైద్రాబాద్ కు తరలించారు. ఊపిరితిత్తుల మార్పిడి కోసం పరీక్షలు చేశారు. కొన్ని ఇబ్బందులు ఉండడంతో మార్పిడిని ఆలస్యమైంది. కానీ ఆమెకు చికిత్స కొనసాగించారు. చికిత్స పొందుతూనే ఆమె ఆదివారం నాడు రాత్రి మరణించారు.

click me!