
కరీంనగర్: తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. గత రెండురోజులగా అయితే పలుజిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసాయి. ఇలా కరీంనగర్ జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా జోరువాన కురుస్తోంది. దీంతో కరీంనగర్ పట్టణంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరదనీరు చెరువును తలపిస్తున్నాయి. ఇలా రోడ్డుపైకి చేరిన మోకాల్లోతు నీటిలోనే అధికారులను వెంటపెట్టుకుని కరీంనగర్ పట్టణంలోని వరద ప్రాంతాల్లో మంగళవారం ఉదయం పర్యటించారు మంత్రి గంగుల కమలాకర్.
కరీంనగర్ పట్టణంలో గంటల వ్యవధిలోనే రోడ్లపై నిలిచిన వరద నీటిని మల్లించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి గంగుల తెలిపారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పోలీస్ సహా అధికార యంత్రాంగమంతా సహాయ చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం, ఆస్థినష్టం జరగకుండా పూర్తి చర్యలు తీసుకున్నట్లు... బాధిత ప్రజలకు అండగా ప్రభుత్వ యంత్రాంగం ఉందన్నారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో మరికొన్నిరోజులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గంగుల సూచించారు.
వీడియో
కరీంనగర్ పట్టణంలోని పద్మనగర్, రేకుర్తి, రాంనగర్ తదితర ఏరియాల్లో రోడ్డు పనులు నడుస్తున్నందున వాటర్ నిలిచిపోయాయని... శాతవాహాన యూనివర్శిటీ వంటి కొన్ని ఓపెన్ ఏరియాల్లోకి వరదనీటిని మల్లించినట్లు మంత్రి తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని... అందరూ గ్రౌండ్లోనే వుండి సహాయక చర్యలు చేపడుతున్నారని అన్నారు. మున్సిపల్ సిబ్బంది మెదలు, రెవెన్యూ, ఇరిగేషన్, వాటర్ వర్క్స్, పోలీస్ శాఖలతో సహా అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యల వల్ల ఇప్పటివరకూ ప్రాణనష్టమేమీ జరగలేదని... అక్కడక్కడ కొంత ఆస్థి నష్టం మాత్రం జరిగిందన్నారు మంత్రి గంగుల.
read more సిరిసిల్లలో కుండపోత... చెరువులా మారిన రోడ్లు, ఇళ్లమధ్యలో వరదనీటి ఉదృతి (వీడియో)
గతంలో గ్రౌండ్ వాటర్ ఎక్కువగా లేకపోవడం వల్ల వర్షాలు పడ్డప్పుడు ఆ నీరు గ్రౌండ్లోకి ఇంకిపోయి భూగర్భజలాలుగా మారేవని... కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల గత సీజన్ నుండి అన్ని జలాశయాలు నిండు కుండల్లా మారి గ్రౌండ్ వాటర్ లెవల్ ఇప్పటికే పెరిగాయన్నారు. అందువల్లే చిన్న వర్షాలకు సైతం రోడ్లపైకి నీరుచేరి వరదలుగా మారుతున్నాయన్నారు. దీంతో ఈ నీటిని ఎక్కడికక్కడ మానేరులోకి మల్లించే విదంగా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి గంగుల.
ఇప్పటికే మానేరు జలాశయం సైతం నిండుకుండలా మారడంతో గేట్లు తెరుచుకున్నాయన్నారు. ప్రకృతి విపత్తులు చెప్పి రావు... ప్రజలకు కలుగుతున్న ఇబ్బందుల్ని అత్యంత త్వరగా తొలగిస్తామని, ప్రజలు సైతం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు మంత్రి గంగుల కమలాకర్.