
నిన్న పెట్రోల్ బంక్ యజమానుల బంద్ హెచ్చరిక మరవక ముందే .. ఇప్పుడు తాజాగా ఎల్పిజి డీలర్ల సమ్మె బాట మొదలెట్టారు.తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే దేశవ్యాపంగా సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు తమ సమ్మె వివరాలను శనివారం ప్రకటించారు. వినియోగ దారుల కి ఇబ్బంది లేకుండా ఈ రోజు నుంచి నిరసన కార్యక్రమం చేస్తున్నామని, 15 నుంచి గ్యాస్ కొనుగోలు నిలిపివేస్తామని ప్రకటించారు. అలాగే 22 న బ్లాక్ డేగా నిర్వహించి 29వ తేదీ నుంచి పుర్తిగా గ్యాస్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. డిసెంబర్ 15 లోపు తమ సమస్యలను పరిష్కరించకపోతే పుర్తిగా గ్యాస్ సరఫరా నిలివేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఇకపై తమకు ఒక్కో ఒక సిలిండర్ పై కమిషన్ను రూ. 66 కు పెంచాలని డిమాండ్ చేశారు.