వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భూకంపం: భయాందోళనలో ప్రజలు

Published : Jan 05, 2022, 02:08 PM ISTUpdated : Jan 05, 2022, 02:59 PM IST
వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భూకంపం: భయాందోళనలో ప్రజలు

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో బుధవారం నాడు స్వల్పంగా భూప్రకంపనలు చోటు చేసుకొన్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. 

హైదరాబాద్: Telangana రాష్ట్రంలోని Vikarabad, Sanga Reddy జిల్లాలో బుధవారం నాడు మధ్యాహ్నం స్వల్పంగా Earth quake దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి పరుగులు తీశారు. వికారాబాద్ జిల్లాలోని దమస్తాపూర్, భుచ్చన్‌పల్లి, మర్పల్లి గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించిందని స్థానికులు చెప్పారు. భూమి కింది భాగంలో కదలిక రావడంతో పొలాల్లో పనిచేస్తున్న రైతులు భయాందోళనలు వ్యక్తం చేశారు.ఈ విషయమై భూగర్భశాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

also read:పండుగ రోజున వరుస భూకంపాలు.. అసోం, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్‌లలో భూకంపం.. భయంతో వణికిపోయిన ప్రజలు

గత ఏడాది సెప్టెంబర్ 12న  వికారాబాద్ జిల్లాలోని బంట్వారం మండల పరిధిలోని తొర్మామిడి, బొపునారం తదితర గ్రామాల్లో భూ కంపం సంబవించింది. ఈ గ్రామాలు కర్ణాటకు సరిహద్దుల్లో ఉంటాయి.  గత ఏడాది ఆగష్టు మాసంలో తొర్మామిడికి 35 కి.మీ దూరంలోని గుల్బర్గా జిల్లా చించోలి తాలుకాలోని కల్కచేడ్ గ్రామంలో కూడా భూకంపం సంబవించింది.

మరోవైపు గతంలో హైద్రాబాద్ లోని బోరబండ, కూకట్‌పల్లి ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది.  గతంలో హైద్రాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలతో పాటు భూమి లోపల చోటు చేసుకొనే మార్పులతో కూడా భూంకంపం వాటిల్లే అవకాశం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గంలో బోరబండ ప్రాంతంలో భూకంపంతో పెద్ద నష్టం లేదని అప్పట్లో శాస్త్రవేత్తలు చెప్పారు.హైద్రాబాద్‌ కు సమీపంలోని వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భూకంపం వాటిల్లడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. హైద్రాబాద్ లోని దుర్గం చెరువులో గతంలో భూకంపం వాటిల్లిందని భూగర్భశాస్త్రవేత్తలు చెప్పారు.

గత ఏడాది అక్టోబర్ 31న తెలంగాణలోని  జగిత్యాల, మంచిర్యాల జిల్లాలతో  పాటు పలు ప్రాంతాల్లో  స్వల్పంగా  భూకంపం సంబవించింది.  77 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. యూరోపియన్ మెడిటరేయన్ సిస్మోలాజికల్ సెంటర్ నివేదిక ప్రకారంగా భూకంప తీవ్రత 4.3 గా నమోదైంది.

జగిత్యాల, రామగుండం, మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేటతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం భూకంపం సంబవించింది.జగిత్యాల,, మంచిర్యాల  జిల్లాలోని  బెజ్జూరు, సలుగుపల్లి, సులుగుపల్లి గ్రామాల్లో స్వల్ప భూకంపం సంబవించింది. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!