మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ అరెస్ట్... కరీంనగర్ లో ఉద్రిక్తత (Video)

Arun Kumar P   | Asianet News
Published : Jan 05, 2022, 01:54 PM ISTUpdated : Jan 05, 2022, 02:13 PM IST
మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ అరెస్ట్... కరీంనగర్ లో ఉద్రిక్తత (Video)

సారాంశం

కరీంనగర్ లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే బిజెపి చీఫ్ బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభను కూడా అరెస్ట్ చేసారు.

కరీంనగర్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) అరెస్ట్ తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ఒక్క అరెస్ట్ తో ఆగకుండా మరికొందరు బిజెపి నాయకుల అరెస్ట్ కు కేసీఆర్ సర్కార్ సిద్దమైనట్లు ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. ఈ క్రమంలోనే తన తూటాల్లాంటి మాటలతో ప్రభుత్వంపైనే కాదు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ నాయకులపై విరుచుకుపడే మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ (bodige shobha) ను కూడా అరెస్ట్ చేసారు.

కరీంనగర్ (karimnagar) పట్టణంలోని శోభ ఇంటికి ఇప్పటికే భారీగా పోలీసులు చేరకున్నారు.అయితే ఈ విషయం తెలిసి అనుచరులతో పాటు బిజెపి (BJP) నాయకులు, కార్యకర్తలు ఆమె ఇంటివద్దకు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

Video

అయితే శోభను కలవడానికి పోలీసులు ప్రయత్నిస్తుండగా ఆమె తలుపులు పెట్టుకుని లోపలే వున్నారు. దీంతో పోలీసులు ఇంటిబయటే కాస్సేపు ఎదురుచూసారు. ఎలాగోలా ఆమె తలుపు తీసేలా చేసి అరెస్ట్ చేసి తమతోపాటు తీసుకువెళ్లారు. 

read more  బండి సంజయ్ అరెస్ట్ : కేసీఆర్, కేటీఆర్ లపై పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదుల వెల్లువ...

ఈ అరెస్ట్ పై ఎమ్మెల్యే శోభ భర్త గాలన్న స్పందిస్తూ...  జాగరణ దీక్ష సమయంలో పోలీసులపై దాడికి పాల్పడినందుకు 333 సెక్షన్ కింద అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారన్నారు.  జాగరణ దీక్షలో శోభ కేవలం పోలీసులతో వాగ్వాదానికి దిగిందని... దాడికి పాల్పలడలేదని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ కు తొత్తుగా వ్యవహరిస్తున్న కరీంనగర్ సిపి సత్యనారాయణ ఇలా అక్రమ అరెస్టులు చేస్తున్నారని గాలన్న ఆరోపించారు.

ఇదిలావుంటే ఇప్పటికే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ లోని తన కార్యాలయంలో జాగరణ దీక్షకు సిద్దమైన బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసారు. తీవ్ర ఉద్రిక్తల మధ్య ఎంపీ కార్యాలయ తలుపులను గ్యాస్ కట్టర్లలో తొలగించి మరీ సంజయ్ ని అరెస్ట్ చేసారు. అంతేకాకుండా అక్కడే వున్న బిజెపి నాయకుల్లో కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగతావారిని చెదరగొట్టారు. కోవిడ్ నిబంధను పాటించడం లేదంటూ పోలీసులు సంజయ్ దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేసారు.

ఈ సమయంలో అక్కడే వున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శోభ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శాంతియుతంగా దీక్షకు దిగితే ఇంత దారుణంగా వ్యవహరించడం ఏమిటంటూ పోలీసులను నిలదీసారు. పోలీసుల తీరును తప్పుబడుతూ ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

read more  టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యం.. పోరాటం మరింత ఉద్ధృతం : హైదరాబాద్‌లో జేపీ నడ్డా

అయితే బండి సంజయ్ అరెస్ట్ అనంతరం తమ విధులకు ఆటంకం కలిగించారని, కొందరు పోలీసులపై దాడి చేసారంటూ బిజెపి నాయకులపై కేసులు నమోదు చేసారు. ఈ క్రమంలోనే శోభపై కూడా కేసులు నమోదవగా తాజాగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేసారు.

ఇక ఇప్పటికే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కూడా పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. పోలీసులతో పాటు సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసాడంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. అతడిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?