
నల్గొండ జిల్లాలో ఓ ప్రేమ జంట అనుమానస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లాలోని చందంపేట మండలం కాసరాజుపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ జంట మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించడంతో పాటు.. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. మృతులను రాకేష్, వరికుప్పల దేవిగా పోలీసులు గుర్తించారు. అయితే రాకేష్, దేవిలు వేర్వేరు సామాజికవర్గాలకు చెందినవారుగా చెబుతున్నారు.
అయితే ప్రేమజంట ఆత్మహత్య చేసుకుందని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఎవరో హత్య చేసి చెట్టుకు వేలాడదీసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగులోకి రానున్నాయి.