కేసీఆర్, హరీశ్‌లు మాట్లాడలేదు.. అంటే బడ్జెట్‌‌పై హ్యాపీయేగా : బండి సంజయ్

Siva Kodati |  
Published : Feb 06, 2021, 08:21 PM ISTUpdated : Feb 06, 2021, 08:22 PM IST
కేసీఆర్, హరీశ్‌లు మాట్లాడలేదు.. అంటే బడ్జెట్‌‌పై హ్యాపీయేగా : బండి సంజయ్

సారాంశం

ఎంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినా విమర్శలు సహజమన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. బడ్జెట్‌పై కేసీఆర్, హరీశ్ రావులు విమర్శలే చేయలేదని ఆయన గుర్తుచేశారు. వాళ్లు కేంద్ర బడ్జెట్‌పై సంతోషంగా ఉన్నారనుకుంటున్నా అని సంజయ్ వ్యాఖ్యానించారు. 

ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం అద్భుతమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ఆయన ప్రశంసించారు. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ బడ్జెట్ రూప కల్పనలో కీలకపాత్ర పోషించారని తెలిపారు.

ప్రతిపక్షాలు కావాలనే దేశవ్యాప్తంగా విమర్శలు చేస్తున్నాయని.. సంక్షేమం పేరుతో ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని సంజయ్ ఎద్దేవా చేశారు. సంక్షేమం ముఖ్యమే కానీ, అభివృద్ధి అంతకన్నా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

సంక్షేమ పథకాల నిధులు పక్కదారి పట్టిస్తున్నారని..  అభివృద్ధి కూడా కుంటుపడుతోంది సంజయ్ మండిపడ్డారు. కరోనా విపత్తులోనూ బడ్జెట్ నిధులను కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుందని బీజేపీ ఎంపీ గుర్తుచేశారు.

బడ్జెట్‌ను రాజకీయ కోణంలో చూడకూడదని.. మోడీ నేతృత్వంలో శక్తివంతమైన భారత్ కోసం పని చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో బీజేపీ పనిచేస్తుందని బండి సంజయ్ వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ