పెద్దపల్లిలో విషాదం: పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమ జంట సూసైడ్

Published : Apr 19, 2022, 09:30 AM ISTUpdated : Apr 19, 2022, 11:05 AM IST
 పెద్దపల్లిలో విషాదం: పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమ జంట సూసైడ్

సారాంశం

పెద్దపల్లి జిల్లాలోని  సుల్తానాబాద్ మండలంలోని కనుకు గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొంది.  వేర్వేరు కులాలు కావడంతో ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు.  

కరీంనగర్: Peddapalli  జిల్లాలోని సుల్తానాబాద్  మండలంలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. sultanabad మండలంలోని కనుకులలో  Shiva అదే గ్రామానికి చెందిన యువతి సుస్మితను ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసకోవాలని కూడా భావించారు. అయితే  వీరిద్దరి కులాలు వేరు కావడంతో రెండు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. ఈ విషయమై రెండు కుటుంబాల సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసులు కూడా ఈ ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు.

అంతేకాదు ఇద్దరు కూడా మైనర్లే. ఈ రెండు కారణాలను చూపి Marriage కి పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్థాపానికి గురైన ప్రియుడు శివ సోమవారం నాడు Suicideకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకొన్న ప్రియురాలు సుస్మిత ఇవాళ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఒక్కరోజు వ్యవధిలోనే ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో రెండు కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది.

PREV
click me!

Recommended Stories

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎంరేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం | Asianet News Telugu
Telangana Weatherman : ఎవరీ తెలంగాణ వెదర్ మ్యాన్? ఎప్పుడు, ఎక్కడ, ఎంత వర్షం పడుతుందో ముందే ఎలా చెబుతున్నాడు?