యాదగిరిగుట్ట మండలం బహుపేటలో రైలుకింద పడి ప్రేమ జంటఆత్మహత్య చేసుకుంది. వీరిద్దరూ మిస్సింగ్ అయినట్టుగా యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
యాదగిరిగుట్ట:మండలంలోని బహుపేటలో రైలు కింద పడి ప్రేమ జంట బుధవారంనాడు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఇద్దరు కన్పించకుండా పోయారని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. కన్పించకుండా పోయిన ప్రేమ జంట బహుపేటలో ఆత్మహత్య చేసుకున్నారు.ఈ విషయాన్నిగుర్తించిన రైల్వేసిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.మృతి చెందిన ప్రేమ జంటలో అమ్మాయికి ఇటీవలనే వివాహమైనట్టుగా స్థానికులు చెబుతున్నారు.రైల్వే సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఇటీవల కాలంలో ప్రేమ జంటల ఆత్మహత్యలపై ప్రతిరోజూ కేసులు నమోదౌతున్నాయి. ఈ నెల 8వ తేదీన ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలంలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. సుబ్బారావు,తేజలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించని కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తేజ ఇంటర్ చదువును మధ్యలో ఆపేసింది.సుబ్బారావు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు.కానీ రెండు కుటుంబాల నుండి సానుకూలమైన వాతావరణం రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.అదే విధంగా తిరుపతిలోని లాడ్జీలో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషయం నిన్ననే వెలుగుచూసింది. మృతులు కోవూరుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.మృతులు కన్పించకుండా పోయారని స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని తిరుపతి పోలీసులు చెప్పారు. మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు.
గత నెల 27న బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ రమణ ఆత్మహత్య చేసుకున్నాడు. బంజారాహిల్స్ లో విధులు నిర్వహించే రమణ అల్వాల్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.గత నెల26న ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. హస్టల్ గదిలో ఆె సూసైడ్ చేసుకుందని పోలీసులు గుర్తించారు.ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.గత నెల 20న విశాఖపట్టణంలో భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇస్తున్న సమయంలో భార్య పోలీస్ స్టేషన్ వద్దే సూసైడ్ చేసుకుంది. గత నెల 19న విశాఖపట్టణంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.