ఒకరికి బ్రేకప్, మరొకతనితో లవ్: అమ్మను చంపి దొరికాక ఏడ్చేసిన కీర్తి

By telugu team  |  First Published Oct 30, 2019, 8:16 AM IST

తొలి ప్రేమికుడికి బ్రేకప్ చెప్పి శశి అనే రెండో ప్రేమికుడితో తిరుగుతున్న కీర్తిని తల్లి రజిత మందలించింది. దీంతో రజితను కీర్తి చంపేసి, రామన్నపేట సమీపంలోిని రైలు పట్టాలపై పడేసి పోలీసులకు దొరికిన తర్వాత ఏడుస్తోంది.


హైదరాబాద్: కొత్త ప్రియుడి మోజులో తల్లి రజితను చంపేసి దొరికిన కీర్తి పోలీసు స్టేషన్ లో ఏడ్చేసింది. అమ్మను చంపి తాను దొరుకుతానని అనుకోలేదని రోదించింది. కొత్త ప్రియుడి మోజులో పడి పాత ప్రియుడిని వదిలించుకోవాలని కీర్తి భావించింది. ఈ విషయంపై మందలించినందుకే  కన్నతల్లి రజితను చంపేసింది. 

తల్లి మృతదేహాన్ని రామన్నపేట సమీపంలోని రైల్వే పట్టాలపై పడేసిన తర్వాత తాను ఎవరికీ దొరుకుతానని కీర్తి అనుకోలేదు. కానీ అన్నీ బయటపడడంతో ఈ రకంగా తాను దొరికిపోతానని అనుకోలేదని, కేసులతో గొడవ అవుతుందని భావించలేదని, జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఊహించలేదని ఆమె పోలీసు స్టేషన్ లో కన్నీరు పెట్టుకుంది.

Latest Videos

Also Read: ఆస్తి కోసమే కీర్తితో శశి ప్రేమాయణం, తల్లిపై ద్వేషం పెంచి... హత్యకు కుట్ర

కీర్తి తొలుత బాల్ రెడ్డి అనే యువకుడిని ప్రేమించింది. ఆ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు కూడా తెలిసిందే. దాంతో ఇరువురికి పెళ్లి చేయాలని రెండు కుటుంబాల వాళ్లు అనుకున్నారు. ఈ లోపల బాల్ రెడ్డి ద్వారా కీర్తి గర్భం దాల్చింది. గర్భాన్ని తొలగించుకునేందుకు ఇంటి పక్కన ఉండే శశి అనే యువకుడి సహాయం తీసుకుంది. శశి తనకు వరుసకు అన్నయ్య అవుతాడంటూ బాల్ రెడ్డికి పరిచయం చేసింది. 

ముగ్గురు కలిసి జనవరిలో మహబూబ్ నగర్ జిల్లా ఆమన్ గల్ ప్రాంతానికి వెల్లి ఓ గదిని కిరాయికి తీసుకున్నారు. కీర్తి అక్కడే అబార్షన్ చేయించుకున్నట్లు భావిస్తున్నారు. ఈ విషయంపై శశి కీర్తిని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడని అంటారు. తనకు లొంగిపోకపోతే అబార్షన్ విషయం నీ తల్లిదండ్రులకు చెబుతానని ఆమెను బెదిరించాడు. 

Also Read: లవ్ అఫైర్, తల్లిని చంపిన కీర్తి ఈమెనే: తండ్రి ఏమన్నారంటే..

శశికి లొంగిపోయిన కీర్తి అతనే లోకంగా భావించసాగింది. ఈ స్థితిలో బాల్ రెడ్డికి బ్రేకప్ చెప్పాలని అనుకున్నట్లు సమాచారం. పెళ్లి కుదిరిన తన కూతురు శశితో తిరగడాన్ని కీర్తి తల్లి రజిత గుర్తించి ఆమెను మందలించింది. దాంతో తాను బాల్ రెడ్డిని వదిలేస్తానని, శశిని పెళ్లి చేసుకుంటానని తల్లితో చెప్పింది 

బాల్ రెడ్డి కుటుంబం కన్నా శిశి కుటుంబం సంపన్నమైంది. శశి బిటెక్ పూర్తి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. దాంతో కీర్తి పూర్తిగా శశివైపు మళ్లింది. అందుకు తల్లి అంగీకరించలేదు. ఆ విషయం శశికి చెప్పింది. దాంతో ఇద్దరు కలిసి రజితను చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. తండ్రి శ్రీనివాస రెడ్డి ఇంట్లో లేని సమయంలో రజితను చంపేశారు. పైగా, నేరాన్ని తండ్రి మీదికి నెట్టేందుకు కీర్తి ప్రయత్నించింది. చివరకు పోలీసులకు చిక్కి ఇప్పుడు ఈసురోమంటోంది.

Also Read: ఇద్దరితో లవ్: తల్లిని చంపి శవం పక్కనే మూడు రోజులు ప్రియుడితో..

click me!