ఇన్నోవా కారు యజమానికి ఝలక్.. రూ.76వేలు జరిమానా

By telugu team  |  First Published Oct 30, 2019, 7:35 AM IST

సీఐఎల్‌ చౌరస్తాలో మంగళవారం ఉదయం కుషాయిగూడ ట్రాఫిక్‌ ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఇన్నోవా వాహనం(టీఎస్‌ 07 ఈబీ 1115) కనిపించడంతో దాని నంబర్‌ను ట్యాబ్‌లో చెక్‌ చేశారు. 


దేశంలో కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన తర్వాత వాహనదారుల్లో కంగారు పెరిగింది. ఇప్పటికే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి... చాలా మంది వాహనదారులు రూ.వేలల్లో జరిమానాలు కట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా... హైదరాబాద్ నగరంలో ఓ కారు యజమానికి ట్రాఫిక్ సిబ్బంది భారీ జరిమానా విధించింది.

సంవత్సరం పాటుగా... చలానాలు చెల్లించకుండా తిరుగుతున్న ఓ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు.  ఈసీఐఎల్‌ చౌరస్తాలో మంగళవారం ఉదయం కుషాయిగూడ ట్రాఫిక్‌ ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఇన్నోవా వాహనం(టీఎస్‌ 07 ఈబీ 1115) కనిపించడంతో దాని నంబర్‌ను ట్యాబ్‌లో చెక్‌ చేశారు. 

Latest Videos

undefined

చలాన్లు పెండింగ్‌ ఉన్నాయి. రూ. 76,425లు చెల్లించాల్సి ఉంది. డ్రైవర్‌ను పిలిచి చలాన్ల గురించి చెప్పారు. అతడు యజమాని శ్రీనివా్‌సకు విషయం తెలియజేశాడు.

వాహన యజమానికి వెంటనే ఈసీఐఎల్‌ చౌరస్తాకు చేరుకోగా ఎస్‌ఐ చలాన్ల జాబితాను అతడి చేతిలో పెట్టారు. సమీపంలోని మీసేవ కేంద్రంలో జరిమానా మొత్తం చెల్లించి వెళ్లిపోయాడు. ఏడాది నుంచి ఆ వాహనంపై చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఎక్కువ చలాన్లు ఔటర్‌ రింగ్‌రోడ్డుపై అతివేగంగా వెళ్లడం వల్ల స్పీడ్‌గన్స్‌తో రికార్డు అయినవే ఉన్నాయని ఎస్‌ఐ తెలిపారు.

click me!