ఇద్దరితో ప్రేమ వ్యవహారం నడుపుతున్న కూతురు కీర్తి చేతిలో తల్లి రజిత హతమైంది. మూడు రోజుల పాటు హైదరాబాదులోని ఇంటిలో శవాన్ని పక్కనే పెట్టుకుని ప్రియుడితో గడిపింది.
హైదరాబాద్: కూతురే స్వయంగా తల్లిని చంపిన సంఘటన వెలుగు చూసింది.ప్రేమ వ్యవహారంలో మందలించినందుకు ప్రియుడితో కలిసి కూతురు తల్లిని హతమార్చింది. రామన్నపేటకు చెందిన పల్లెర్ల శ్రీనివాస్ రెడ్డి బ్రతుకు దెరువు నిమిత్తం హైదరాబాద్ నగరానికి వలస వచ్చి మునగనీర్ లో నివాసం ఉండున్నారు.
కూతురు కీర్తి ఇద్దరు యువకులతో ప్రేమ వ్వహారం నడిపిస్తున్న విషయాన్ని తల్లి రజిత (38) గుర్తించింది. కూతురు కీర్తిని తల్లి రజిత మందలించింది. దాంతో కక్ష పెంచుకుని ప్రియుడితో కలిసి హతమార్చింది.
తండ్రి లారీ డ్రైవర్ గా డ్యూటీకి వెళ్లగా తల్లి మృత దేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ప్రియుడితో కలిసి కీర్తి ఇంట్లో మూడు రోజుల పాటు గడిపింది. దుర్వాసన రావడంతో అదే ప్రియుడి సహాయంతో స్వగ్రామం రామన్నపేట సమీపంలో రైలు పట్టాల వద్ద మృతదేహాన్ని పడేసింది.
తాను విశాఖపట్నం పర్యటనకు వెళ్లానని తండ్రికి చెప్పి ఇంటి వెనకాల ఉండే మరో ప్రియుడితో కీర్తి గడిపింది. తండ్రి శ్రీనావాస్ రెడ్డి నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో తానే ప్రియుడితో కలిసి తల్లి రజితను హతమార్చినట్లు కీర్తి అంగీకరించింది.