
హైదరాబాద్: హైద్రాబాద్ వనస్థలిపురంలోని టైర్ల గోడౌన్‌లో ఆదివారం నాడు సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదం కారణంగా దట్టమైన పొగతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వనస్థలిపురంలోని టైర్ల గోడౌన్‌కు పక్కనే అపార్ట్‌మెంట్‌వాసులు భయంతో తమ ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోయారు. వనస్థలిపురంలో టైర్ల గోడౌన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని స్థానికులు చెప్పారు.
ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకొన్న విషయం తెలుసుకొన్న వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నిస్తున్నారు.
టైర్ల గోడౌన్లలో భారీగా మంటలు వ్యాపించడంతో ఈ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దట్టమైన పొగలతో స్థానికులు భయపడ్డారు.