"టీఆర్ఎస్ పార్టీ - కెసిఆర్" డాక్యుమెంటరీ సీడీని ఆవిష్కరించిన కవిత

By Arun Kumar PFirst Published Nov 19, 2018, 7:01 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే ఈ పార్టీ ప్రచారం కోసం ఇంగ్లాండ్ నుండి టీఆర్ఎస్ యూకే బృందం రాష్ట్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నారై బృందం పార్టీ టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుండి కేసీఆర్ ప్రస్థానం ఎలా సాగిందన్న దానిపై ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. ముఖ్యంగా కెసిఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమ మరియు అభివృద్ధి గురించి రూపొందించిన ఈ డాక్యుమెంటరీ సీడీని నిజామాబాద్ ఎంపీ కవిత ఆవిష్కరించారు. 
 
ఇవాళ ఎన్నారై బృందం కవితతో సమావేశమై ఎన్నికల ప్రచారం గురించి చర్చించారు. రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో తాము నిర్వహించబోయే ప్రచారాన్ని గురించి వారు ఎంపీకి వివరించారు. ఈ సందర్భంగా కవిత వారికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సెల్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం,యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ సీకా చంద్రశేఖర్ గౌడ్, నాయకులు మల్లేష్ పప్పుల పాల్గొన్నారు. 

click me!