హైదరాబాద్‌లో Formula E రేసింగ్.. కీలక ఒప్పందం.. గ్రీన్ ఎనర్జీ దిశగా మరిన్ని ప్రయత్నాలు జరగాలన్న కేటీఆర్

By Sumanth KanukulaFirst Published Jan 17, 2022, 2:21 PM IST
Highlights

తెలంగాణలో పచ్చదనం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హరితాహరం ద్వారా ఏడేళ్ల తర్వాత 2 బిలియన్స్‌ కంటే ఎక్కువ మొక్కలను నాటామని చెప్పారు. గత ఏడేళ్లలో మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో గ్రీనరీ పెరిగిందని చెప్పారు.  

తెలంగాణలో పచ్చదనం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హరితాహరం ద్వారా ఏడేళ్ల తర్వాత 2 బిలియన్స్‌ కంటే ఎక్కువ మొక్కలను నాటామని చెప్పారు. గత ఏడేళ్లలో మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో గ్రీనరీ పెరిగిందని చెప్పారు.  Formula E world championship నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి, Formula E Associationకు, గ్రీన్ కో అనే సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలోనే పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వేదికగా ఈ ఏడాది చివరి నాటికి గానీ, వచ్చే ఏడాది మార్చి నాటికి ఫార్ములా ఈ రేసింగ్ జరగనుందని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ దిశగా మరిన్ని ప్రయత్నాలు జరగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. భవిష్యత్ తరాలకు చక్కని వాతావరణం అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. 

ఎలక్ట్రిక్ వాహనాలు మరింతగా పెరగాల్సి ఉందని కేటీఆర్ అన్నారు. ఫార్ములా - ఈ రేసింగ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ దిశగా మరిన్ని ప్రయత్నాలు జరగాలన్నారు. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందుందని అన్నారు. ప్రపంచంలో నివాసయోగ్య నగరాల జాబితాలో హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానం అని తెలిపారు. హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. అంతర్జాతీయ సంస్థలకు అవసరమైన సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

ఇక,  ఈ రేసింగ్ ను ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డీ ఆటోమొబైల్ (Federation of Internationale de Automobile) అనే సంస్థ ప్రతి ఏడాది ఒక్కో నగరంలో నిర్వహిస్తుంటుంది. ఇది ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్. ఈ రేసింగ్ జరగబోతున్న నేపథ్యంలో లండన్, న్యూయార్క్, రోమ్, సియోల్ వంటి నగరాల సరసన హైదరాబాద్ చేరబోతోంది. ఇతర రేసింగ్ లకు ఈ కార్ రేసింగ్ లకు తేడా ఉంది. ఇతర రేసింగ్ లను ప్రత్యేకంగా నిర్మించిన రేస్ ట్రాక్ లలో నిర్వహిస్తారు. ఈ రేసింగ్ కు పత్యేక ట్రాక్ అవసరం లేదు. నగరంలో రోడ్లు సాఫీగా ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు సరిగ్గా ఉండాలి. ఈ ఒప్పందంలో భాగంగా రేస్ నిర్వహించే ప్రాంతాల్లో రోడ్లను విస్తరించాల్సి ఉంటుంది. అంతేకాదు, ప్రేక్షకుల కోసం అక్కడక్కడ స్టాండ్స్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

click me!