Lok Sabha Election Results 2024: సార్వత్రిక ఎన్నికలు 2024 లో తెలంగాణ బీజేపీ అద్భుత ఫలితాలు సాధించింది. ఏకంగా 8 స్థానాలు గెలుచుకుంది. మహబుబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ గెలుపొందారు.
Telangana BJP MPs : సార్వత్రిక ఎన్నికలు 2024 ఫలితాల్లో తెలంగాణలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల (బీజేపీ) మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొమ్మిది స్థానాలు గెలుచుకున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎక్కడా పోటీలో నిలవలేకపోయింది. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంది. బీజేపీ 8, కాంగ్రెస్ 8 స్థానాలను దక్కించుకున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) కూడా రేసులో ఉన్నప్పటికీ ఆ పార్టీ హైదరాబాద్ లోక్ సభ స్థానాన్ని మాత్రమే నిలబెట్టుకుంది. బీజేపీ గతంలో కంటే ఎక్కువ స్థానాలు సాధించింది.
undefined
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఏంపీలు వీరే
స.నెం | పార్లమెంట్ నియోజకవర్గం | అభ్యర్థి | మొత్తం ఓట్లు | మార్జిన్ | ప్రత్యర్థి |
1 | ఆదిలాబాద్ | జీ.నగేష్ | 552824 | 84397 | ఆత్రం సుగుణ (కాంగ్రెస్) |
2 | కరీంనగర్ | బండి సంజయ్ కుమార్ | 578827 | 221381 | వెలిచాల రాజేందర్ రావు (కాంగ్రెస్) |
3 | నిజామాబాద్ | అరవింద్ ధర్మపురి | 592318 | 109241 | జీవన్ రెడ్డి తాటిపర్తి (కాంగ్రెస్) |
4 | మెదక్ | రఘునందన్ రావు | 458611 | 34863 | నీలం మధు (కాంగ్రెస్) |
5 | మల్కాజిగిరి | ఈటల రాజేందర్ | 980712 | 387375 | పట్నం సునీతా మహేందర్ రెడ్డి (కాంగ్రెస్ |
6 | సికింద్రాబాద్ | జి. కిషన్ రెడ్డి | 473012 | 49944 | దానం నాగేందర్ (కాంగ్రెస్) |
7 | చేవెళ్ల | కొండా విశ్వేశ్వర్ రెడ్డి | 725848 | 164182 | గడ్డం రంజిత్ రెడ్డి (కాంగ్రెస్) |
8 | మహబూబ్ నగర్ | డీకే అరుణ | 505600 | 5193 | చల్లా వంశీ చంద్ రెడ్డి (కాంగ్రెస్) |
పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024.. పవన్ కళ్యాణ్ గెలుపు