Telangana : బీజేపీ,కాంగ్రెస్ మధ్య హోరాహోరీ.. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు దిమ్మ తిరిగే షాక్..

By Rajesh Karampoori  |  First Published Jun 4, 2024, 3:32 PM IST

Telangana Lok Sabha Poll Result 2024: తెలంగాణలోని లోక్‌సభ స్థానాల ఫలితాలు ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తుంది. కానీ, గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ పార్టీ మాత్రం కేవలం నామమాత్రం పోటీని ఇచ్చింది. ఒక సీటులో కూడా అధిక్యం కనబరచలేకపోయింది. పూర్తి ఎన్నికల ఫలితాలిలా..
 


Telangana Lok Sabha Poll Result 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఉహించని ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి తెలంగాణలో ఉద్యమపార్టీ బీఆర్ఎస్ కి ఊహించని షాక్ తగిలింది.  తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకుగాను బీజేపీకు 8, కాంగ్రెస్ కు 8, ఎంఐఎంకు 1 సీట్లో అధికంలో ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఊహించలేని షాక్ తగలింది. మాజీ సీఎం కేసీఆర్ తన పురిటి గడ్డ, మెదక్ పార్లమెంట్ స్థానంలో కూడా బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది. 
 
తెలంగాణ పార్టమెంట్ ఎన్నికల ఫలితాలు ఇలా ..  

గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. 

Latest Videos

undefined

భువనగిరిలో కిరణ్‌కుమార్‌రెడ్డి 1.95 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు.  

ఖమ్మంలో నామా నాగేశ్వరరావుపై రఘురాంరెడ్డి విజయం సాధించారు.

వరంగల్‌లో అరూరి రమేశ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం సాధించారు. 

నల్గొండలో సైదిరెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్‌ రెడ్డి విజయం సాధించారు. 

మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవితపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్‌ గెలుపొందారు.

జహీరాబాద్‌లో  బీజేపీ అభ్యర్థిపై బీబీ పాటిల్‌పై  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ పై విజయం సాధించారు. 

ఖమ్మంలో 4.30 లక్షల ఓట్ల ఆధిక్యంతో రఘురాంరెడ్డి గెలుపు

అలాగే..హైదరాబాద్‌లో 2.2 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌ నిలిచారు. 

సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి  61 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 2.70 లక్షల ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.

చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి 1.07 లక్షల ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నాయి.  

ఆదిలాబాద్‌లో ఆత్రం సుగుణపై బీజేపీ గోడం నగేష్‌ విజయం సాధించారు.
 

click me!