రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరో పది రోజులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సడలింపు సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. అలాగే ఇంటికి వెళ్లేందుకు మరో గంట సమయం ఇచ్చింది.
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరో పది రోజులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సడలింపు సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. అలాగే ఇంటికి వెళ్లేందుకు మరో గంట సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ పొడిగింపునకు అనుగుణంగా హైదరాబాద్ మెట్రో సమయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తొలుత ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ రిలాక్సేషన్ సమయం ఇవ్వడంతో అప్పుడు మెట్రో కూడా అప్పటి రిలాక్సేషన్ సమయానికి అనుగుణంగానే నడిచింది. మలివిడత లాక్డౌన్ విధించినప్పుడు రిలాక్సేషన్ సమయం మరో మూడు గంటలు పెరిగింది.
Also Read:లాక్డౌన్ పొడిగింపు, రేషన్ డీలర్ల సమస్యలపై కేబినెట్ సబ్‌కమిటీ: తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాలివే..!!
ఈ క్రమంలోనే మెట్రో సమయం విషయంలో కూడా మార్పు చేశారు. తాజాగా రేపటి నుంచి సడలింపు సమయం సాయంత్రం 5 గంటల వరకు వుండటంతో మెట్రో వేళల్ని పొడిగించింది. దీనికి అనుగుణంగానే రేపటి నుంచి మెట్రో సర్వీసుల సమయం పెరిగింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందించనుంది. చివరి మెట్రో రైలు సాయంత్రం 5 గంటలకు బయలుదేరనుంది.