ఎన్నిసార్లు ఓడినా సమీక్షల్లేవ్, కొత్త కమిటీతో లాభమేమిటీ?: వీహెచ్ ప్రశ్న

Published : Jun 09, 2021, 02:58 PM IST
ఎన్నిసార్లు ఓడినా సమీక్షల్లేవ్, కొత్త కమిటీతో లాభమేమిటీ?: వీహెచ్ ప్రశ్న

సారాంశం

పార్టీలో నెలకొన్న సమస్యలపై చర్చించకుండా కొత్త కమిటీ ప్రకటిస్తే  ఎలా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు   ప్రశ్నించారు    

హైదరాబాద్:పార్టీలో నెలకొన్న సమస్యలపై చర్చించకుండా కొత్త కమిటీ ప్రకటిస్తే  ఎలా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు   ప్రశ్నించారు  బుధవారం నాడు హైద్రాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలౌతోందన్నారు. ఎన్ని ఓటములు జరిగినా కనీసం ఒక్క ఓటమిపై కూడ పార్టీ ఎందుకు సమీక్షలు నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు. 

also read:రేవంత్‌రెడ్డి అనుచరులు బెదిరిస్తున్నారు: ఉత్తమ్‌కి వీహెచ్ లేఖ

నాడు కుంతియా, నేడు ఠాగూరులు  పార్టీ ఓటమిపై సమీక్షలు చేయడం మర్చిపోయారన్నారు.  ఇంచార్జీలు వస్తున్నారు... పోతున్నారు తప్ప పార్టీలో సమస్యలపై ఎలాంటి సమీక్షలు చేయడం లేదని ఆయన చెప్పారు. పార్టీ వ్యవహరశైలితో బీసీలు కాంగ్రెస్ పార్టీకి దూరమౌతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.తెలంగాణలో 2018 నుండి కొత్త కమిటీని ప్రకటించలేదన్నారు. 

నాగార్జునసాగర్ లో సీనియర్ నేత జానారెడ్డి ఓటమి పాలైనా కూడ  కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సమీక్ష చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.  తాను ఎవరికీ కూడ వ్యతిరేకం కాదన్నారు. కానీ కష్టకాలంలో పార్టీని కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానని ఆయన చెప్పారు.రాష్ట్రంలో పార్టీ వరుస ఓటములపై రివ్యూ జరపాలని సోనియాగాంధీకి లేఖ రాసినట్టుగా ఆయన తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.