లాక్‌డౌన్ ఎఫెక్ట్: 2660 వలస కార్మికులు సంగారెడ్డి నుండి జార్ఖండ్‌కు తరలింపు

By narsimha lode  |  First Published May 1, 2020, 11:16 AM IST

సంగారెడ్డి జిల్లాలోని కంది ఐఐటీ క్యాంపులో ఉన్న వలస కార్మికులను స్వంత గ్రామాలకు బయలుదేరారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 2,660 వలస కార్మికులను తిరిగి ఆ రాష్ట్రానికి తరలించారు.
 


హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని కంది ఐఐటీ క్యాంపులో ఉన్న వలస కార్మికులను స్వంత గ్రామాలకు బయలుదేరారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 2,660 వలస కార్మికులను తిరిగి ఆ రాష్ట్రానికి తరలించారు.

కందిలో ఐఐటీ భవనాల నిర్మాణం కోసం  ఇతర రాష్ట్రాలకు చెందిన  కార్మికులు ఇక్కడకు వచ్చారు. లాక్ డౌన్ నేపథ్యంలో   వలస కార్మికులకు పనులు లేకుండా పోయాయి. భవన నిర్మాణ సమయంలోని క్యాంపులోనే కార్మికులు ఉన్నారు.

Latest Videos

undefined

తమను తమ గ్రామాలకు పంపాలని కోరుతూ కంది ఐఐటీ క్యాంప్ వద్ద వలస కార్మికులు ఏప్రిల్ 29వ తేదీన ఆందోళన నిర్వహించారు. అడ్డుకొన్న పోలీసులపై దాడికి దిగారు.ఈ దాడిలో  ఎఎస్ఐకు గాయాలయ్యాయి. పోలీస్ వాహనం ధ్వంసమైంది.

అయితే ఏప్రిల్ 30వ తేదీ లోపుగా  కార్మికులకు వేతనాలు చెల్లించాలని కలెక్టర్ కాంట్రాక్టర్ ను ఆదేశించారు.  ఏప్రిల్ 29వ సాయంత్రమే వలస కార్మికులను ఆయా రాష్ట్రాలకు పంపేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

also read:రేపటిలోపుగా వలస కూలీలకు జీతాలు చెల్లించాలి: కాంట్రాక్టర్‌కు కలెక్టర్ ఆదేశం

కేంద్రం సూచనల మేరకు వేతనాలు తీసుకొన్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 2660 కార్మికులను ఆ రాష్ట్రానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయయం 57 బస్సుల్లో కార్మికులను లింగంపల్లి రైల్వే స్టేషన్ కు తరలించారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి కార్మికులను రైళ్లలో  జార్ఖండ్ కు తరలించనున్నారు.

వలస కార్మికులను వారి స్వంత రాష్ట్రాలకు తరలించేందుకు తరలించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. అయితే వలస కార్మికులను తరలించేందుకు కేంద్రం ప్రత్యేక  రైళ్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

వలస కార్మికులను తరలించేందుకు రైళ్లను ఏర్పాటు చేస్తమని కేంద్రం ప్రకటించింది. దీంతో లింగంపల్లి  నుండి ప్రత్యేక రైళ్లలో జార్ఖండ్ కార్మికులు ఆయా రాష్ట్రాలకు వెళ్లనున్నారు.కంది ఐఐటీ క్యాంపులో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులను తమ రాష్ట్రాలకు  పంపేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. 


 

click me!