Singareni: సింగరేణి గనిలో ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి..

Published : Nov 10, 2021, 01:19 PM ISTUpdated : Nov 10, 2021, 04:22 PM IST
Singareni: సింగరేణి గనిలో ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి..

సారాంశం

సింగరేణి బొగ్గు గనిలో (singareni mine) ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గని పైకప్పు కూలిన ఘటనలో నలుగురు కార్మికులు మృతిచెందారు. 

సింగరేణి బొగ్గు గనిలో (singareni mine) ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గని పైకప్పు కూలిన ఘటనలో నలుగురు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని  శ్రీరాంపూర్ (srirampur mine) సింగరేణి ఎస్ఆర్పీ-3 గనిలో చోటుచేసుకుంది. కార్మికులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కార్మికులపై పైకప్పు కూలింది. 

ఉదయం షిప్ట్‌లో విధులకు వచ్చిన కృష్ణారెడ్డి (59), లక్ష్మయ్య (60), సూర్య నరసింహ రాజు (30), చంద్రశేఖర్ (29) అనే కార్మికులపై గని పై కప్పు కూలింది. దీంతో వారు గనిలోనే మరణించారు. మృతదేహాలను వెలికితీయడానికి సింగరేణి రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు