మైక్రో ఫైనాన్స్ యాప్స్: 4 కాల్ సెంటర్లు సీజ్, ఆరుగురి అరెస్ట్

By narsimha lode  |  First Published Dec 22, 2020, 12:50 PM IST

మైక్రో ఫైనాన్స్ కు చెందిన 16 యాప్‌లకు చెందిన  నాలుగు కాల్ సెంటర్లను సీజ్ చేశారు హైద్రాబాద్ పోలీసులు.


హైదరాబాద్: మైక్రో ఫైనాన్స్ కు చెందిన 16 యాప్‌లకు చెందిన  నాలుగు కాల్ సెంటర్లను సీజ్ చేశారు హైద్రాబాద్ పోలీసులు.

also read:మైక్రో ఫైనాన్స్ యాప్స్ కేసు: ఇద్దరిని అరెస్ట్ చేసిన హైద్రాబాద్ పోలీసులు

Latest Videos

మైక్రో ఫైనాన్స్ యాప్ సంస్థలపై పోలీసులకు బాధితుల నుండి అందిన ఫిర్యాదు మేరకు  పోలీసులు రంగంలోకి దిగారు. ఈ యాప్ సంస్థలకు చెందిన ప్రతినిధుల వేధింపుల కారణంగా  కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.తాము తీవ్రంగా వేధింపులకు గురైనట్టుగా కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

also read:మైక్రో ఫైనాన్స్ యాప్స్ గుట్టురట్టు: సైబరాబాద్ పోలీసుల దాడులు, కేంద్రం ఇదీ..

16 యాప్ ల కు సంబంధించి నాలుగు కాల్ సెంటర్లను పోలీసులు సీజ్ చేశారు.ఈ కాల్ సెంటర్లలో పనిచేస్తున్న 1100 మంది ఉద్యోగులకు పోలీసులు నోటీసులు పంపారు.ఇప్పటికే ఈ సంస్థలకు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

గో క్యాష్, ఒకే క్యాష్, ఈ క్యాష్, నిప్పెట్ లోన్, క్రేజీబిల్, లిక్విడ్ క్యాష్, క్యాష్ బీ, రూపీకాంటా, బబుల్ లోన్, పైసాలోన్, పిగీ బ్యాంక్, బిల్ క్యాష్, ఉదర్ లోన్, లోన్ ట్యాప్, స్లిప్పెట్, ఫ్లెక్సీ క్యాష్ యాప్ సంస్థలను పోలీసులు గుర్తించారు.   ఈ సంస్థలకు చెందిన సమాచారాన్ని పోలీసులు సేకరించారు.

గురుగ్రామ్ కేంద్రంగా కొన్ని యాప్ సంస్థల ప్రతినిధులు డబ్బులు తీసుకొన్న వారిని వేధించినట్టుగా పోలీసులు గుర్తించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.హైద్రాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో ఈ సంస్థలకు చెందిన కాల్ సెంటర్లపై సోదాలు చేశారు.


 

click me!