మందు బాబులకు గుడ్ న్యూస్: తెలంగాణలో తగ్గిన మద్యం ధరలు

By narsimha lode  |  First Published May 5, 2023, 9:13 PM IST

తెలంగాణలో  మద్యం ధరలు  తగ్గాయి. తగ్గిన ధరలు రేపటి నుండి అమల్లోకి రానున్నాయి.  తెలంగాణ సర్కార్  ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.  
 


హైదరాబాద్:  తెలంగాణలో మద్యం ధరలను తగ్గించింది  కేసీఆర్ సర్కార్. తగ్గించిన  ధరలు రేపటి నుండి అమల్లోకి రానున్నాయి.  బీరు మినహా  అన్ని రకాల మద్యం ధరలను  ప్రభుత్వం తగ్గించింది.  ప్రభుత్వం విధిస్తున్న  ఎక్సైజ్  సుంకాన్ని ప్రభుత్వం తగ్గించింది.  దీంతో  మద్యం ధరలు తగ్గనున్నాయి.  నకిలీ మద్యం  సరఫరాకు చెక్ పెట్టేందుకు  ప్రభుత్వం  ఈ నిర్ణయం తీసుకుంది.  క్వార్టర్ బాటిల్ పై  రూ. 10, హాఫ్  బాటిల్ పై  రూ. 20  , పుల్ బాటిల్ రూ., 40  తగ్గిస్తూ  తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  మద్యం ధరలను  20 శాతం పెంచింది.  ధరల పెంపు కారణంగా  మద్యం విక్రయాలు తగ్గినట్టుగా  అప్పట్లో ఎక్సైజ్ శాఖ గుర్తించింది. మద్యం ధరల పెంపుదల కారణంగా  నకిలీ బ్రాండ్లు  మార్కెట్లోకి  విస్తృతంగా  వచ్చే అవకాశం ఉందని  ఎక్సైజ్ శాఖాధికారులు అనుమానించారు. దీంతో  మద్యం ధరలను తగ్గించింది  ప్రభుత్వం. మద్యంపై ఉన్న  ఎక్సైజ్ సుంకాన్ని  తగ్గించింది.  దీంతో మద్యం ధరలు తగ్గనున్నాయి

Latest Videos

undefined

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి  ఎక్కువ మొత్తంలో ఆదాయం మద్యం  అమ్మకాల నుండి వస్తుంది.  దసరా వంటి పర్వదినం సమయంలో తెలంగాణలో భారీ ఎత్తున మద్యం విక్రయాలు సాగుతాయి.  హైద్రాబాద్, రంగారెడ్డి,  నల్గొండ, మెదక్  , మహబూబ్ నగర్  జిల్లాల్లో  భారీగా మద్యం విక్రయాలు  సాగుతాయని  గణాంకాలు చెబుతున్నాయి.  

మునుగోడు  ఉప ఎన్నికల సమయంలో  నకిలీ మద్యం  సరఫరా అంశం తెరమీదికి వచ్చింది.  ఒడిశా  రాష్ట్రంలో  తయారు చేసిన  నకిలీ మద్యాన్ని  మునుగోడు  ఉప ఎన్నికల సమయంలో  భారీగానే  విక్రయించారని  ఎక్సైజ్ శాఖ గుర్తించింది. ఒడిశాలోని   నకిలీ మద్యం యూనిట్ ను తెలంగాణ ఎక్సైజ్ శాఖాధికారులు  ధ్వంసం  చేసిన విషయం తెలిసిందే.

click me!