ఎదుగుతున్నాడని... సొంత అన్నకొడుకుని చంపేసి..

Published : May 06, 2020, 07:38 AM IST
ఎదుగుతున్నాడని... సొంత అన్నకొడుకుని చంపేసి..

సారాంశం

నెల్లూరులో హోటల్‌ వ్యాపారం చేస్తూ రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉండేవాడు. అనతికాలంలోనే సంపన్నుడయ్యాడు.

పిల్లలు జీవితంలో ఎదుగుతుంటే పెద్దలు సంబరపడిపోతుంటారు. అయితే.. ఓ వ్యక్తి మాత్రం తట్టుకోలేకపోయాడు. తన అన్న కొడుకు ఉన్నతంగా  ఎదగడం చూసి ఓర్వలేకపోయాడు. అసూయతో కొడుకులాంటి వాడు అని కూడా చూడకుండా అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మేడేపల్లి పెదవెంగయ్య, ప్రభావతిల ఏకైక కుమారుడైన వెంగళనాయుడు నెల్లూరులో హోటల్‌ వ్యాపారం చేస్తూ రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉండేవాడు. అనతికాలంలోనే సంపన్నుడయ్యాడు.

 దీనిని సహించలేక బాబాయ్‌ అయిన రామకృష్ణ, నడిపి వెంగయ్య హత్యకు పథకం పన్నారు. తమ బంధువులైన శ్రీనివాసులు, హజన్న, వంశీకృష్ణ, వెంకటేష్‌తో కలిసి ఈనెల 1వ తేదీన పాలాల్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. అతను మత్తులోకి జారుకోగానే గొంతుకు ఉరి వేసి చంపారు.

అనంతరం మృతదేహాన్ని శంకవరం, వెంకటాద్రిపాళెం గ్రామాల మధ్యలో ఉన్న పొలాల ట్రంచ్‌ కాలువలో వేసి పూడ్చివేశారు. అయితే వెంగళనాయుడు బంధువు రమేష్‌ ఆదివారం ఆయన కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి బాబాయ్‌ రామకృష్ణను అరెస్టు చేసి విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం నిర్వహించారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్
చైనా మంజాను ఎలా త‌యారు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రాణాలు పోయేంత ప్ర‌మాదం ఎందుకు.?