మందుబాబులకు షాక్.. తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం ధరలు, రేపటి నుంచే అమల్లోకి

By Siva KodatiFirst Published May 18, 2022, 9:31 PM IST
Highlights

మందు బాబులకు షాకిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. బీరు, మద్యం ధరలను భారీగా పెంచింది. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో తెలిపింది. 
 

తెలంగాణ మందు బాబులకు షాకిచ్చింది ప్రభుత్వం (telangana govt) . మద్యం ధరలను (liquor price hike) భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఒక్కో బీర్‌పై (beer price)  రూ.20 పెంచింది. అలాగే క్వార్టర్ మద్యం ధరను కూడా రూ.20 మేర పెంచింది. పెరిగిన మద్యం ధరలు ఈ నెల 19 నుంచి అమల్లోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. మద్యం దుకాణాల్లో ఇవాళ్టీ అమ్మకాలు పూర్తి కాగానే మద్యం సీజ్ చేయనున్నారు అధికారులు. నిల్వ వున్న మద్యాన్ని లెక్కించి రేపటి నుంచి పెరిగిన ధరల ప్రకారం విక్రయించేలా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. 

ఇకపోతే.. తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మద్యం ప్రియులు బీర్లు తెగ తాగేస్తున్నారు. ఎండాకాలం కావడంతో ఉక్కపోతలు, వేడిగాలుల నుంచి సేద తీరేందుకు కూల్‌ కూల్‌గా బీర్లను లాగించేస్తున్నారు. గతేడాది మే నెలతో పోల్చితే ఈ వేసవి సీజన్‌లో బీర్ల అమ్మకాలు 90 శాతం ఎక్కువగా నమోదయ్యాయని అబ్కారీ శాఖ వెల్లడించింది.. బీర్లతో పాటు లిక్కర్ అమ్మకాలు కూడా పెరిగాయని తెలిపింది. మార్చి నుంచి ఇప్పటిదాకా రూ.6,702 కోట్ల బీర్ సేల్స్‌ జరిగాయని... ఈ ఏడాది మే నెలలో మద్యం ప్రియులు 10.64 కోట్ల లీటర్ల బీరును తాగేశారని ఎక్సైజ్ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి.

బీర్ల సేల్స్‌లో తెలంగాణలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ 2.38 కోట్ల లీటర్ల బీరు విక్రయం జరగ్గా... 1.15 కోట్ల లీటర్ల విక్రయాలతో వరంగల్‌ రెండో స్థానంలో ఉంది. గడిచిన కొద్దిరోజులుగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతుండడంతో.. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరగాయని అబ్కారీ అధికారులు చెబుతున్నారు.

click me!