హైదరాబాద్‌: బీజేపీ కార్పోరేటర్ మృతి.. ఇంకా జరగని ప్రమాణ స్వీకారం

Siva Kodati |  
Published : Dec 31, 2020, 10:11 PM IST
హైదరాబాద్‌: బీజేపీ కార్పోరేటర్ మృతి.. ఇంకా జరగని ప్రమాణ స్వీకారం

సారాంశం

హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరపున లింగోజిగూడ నుంచి కార్పొరేటర్‌‌గా గెలిచిన ఆకుల రమేశ్‌ మృతిచెందారు. 

హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరపున లింగోజిగూడ నుంచి కార్పొరేటర్‌‌గా గెలిచిన ఆకుల రమేశ్‌ మృతిచెందారు.

ఎన్నికల ఫలితాల అనంతరం రమేశ్‌ గౌడ్‌కు కొవిడ్‌ నిర్థారణ కావడంతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే ఆరోగ్యం కుదటపడకపోవడంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు.

ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో రమేశ్‌గౌడ్‌ గురువారం తుదిశ్వాస విడిచారు. రమేశ్‌గౌడ్‌ గతంలో ఎల్బీనగర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌గానూ పనిచేశారు.

రమేశ్‌గౌడ్‌ మృతిపట్ల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో గెలిచి ప్రమాణస్వీకారం కూడా చేయకముందే ఆయన మృతిచెందడం బాధాకరమన్నారు. 

PREV
click me!

Recommended Stories

Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు