కేంద్రం గ్రీన్ సిగ్నల్.. తెలంగాణ కొత్త సచివాలయానికి లైన్ క్లియర్

By Siva KodatiFirst Published Dec 31, 2020, 7:34 PM IST
Highlights

తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. నూతన సచివాలయ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి ఇప్పటికే తెలంగాణ హైకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. 

తెలంగాణ పాత సచివాలయాన్ని ప్రభుత్వం ఇప్పటికే కూల్చివేసింది. కొత్త సచివాలయాన్ని రాష్ట్ర కీర్తిప్రతిష్టలు ప్రతిబింబించేలా అద్భుత రీతిలో నిర్మించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త సెక్రటేరియేట్‌ తుది డిజైన్‌పై కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.

దీనిపై పలుమార్లు సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులతో చర్చలు జరిపారు. కొన్ని మార్పులు సూచించి తుది మెరుగులు దిద్దారు. కొత్తగా ప్రభుత్వం ఆమోదించిన డిజైన్‌లో భవనం ముందు స్థలంలో హెలిప్యాడ్, రెండు వైపులా లాన్లు, వాహనాల పార్కింగ్‌ స్థలంలో చిన్న పాటి మార్పులు చేశారు.

కొద్ది నెలల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త సచివాలయ ఫైనల్ డిజైన్‌తో పాటు సచివాలయ నిర్మాణానికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

click me!