తెలంగాణ గవర్నర్ తమిళిసై (Telangana Governer Tamilisai Soundararajan) అసెంబ్లీ (assembly)లో ఉభయ సభలను ఉద్దేశించి శుక్రవారం ప్రసంగించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు. తెలంగాణ ఇప్పుడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటుందని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలన, నియంతృత్వ పోకడల నుంచి రాష్ట్రానికి విముక్తి లభించిందని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ మూడో శాసనసభ సమావేశాల సందర్భంగా ఆమె ఉభయ సభలను ఉద్దేశించి శుక్రవారం మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష, అణచివేతకు గురైన వారికి న్యాయం చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం సంస్థలు, సంస్థల ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిందని ఆరోపించారు.
రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ ప్రమాణస్వీకారం.. హాజరైన ప్రధాని మోడీ..
ప్రజాస్వామ్యంలో సంస్థలు వ్యక్తిగత ఆరాధనలకు పాల్పడటం మంచిది కాదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. పదేళ్ల అణచివేత నుంచి విముక్తి కల్పించేందుకు తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. 2023 తెలంగాణ ప్రయాణానికి కొత్త ఆరంభాన్ని తెచ్చిన సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రజలు ఇప్పటికే మార్పును అనుభవిస్తున్నారని చెప్పారు.
నెలసరి సెలవులపై స్మృతి ఇరానీ వ్యాఖ్యలు.. ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం..
తెలంగాణ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పని చేస్తుందని చెప్పారు. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ఆర్థిక వివేకం తీసుకువచ్చి ప్రజలకు పాలన, సంక్షేమాన్ని అందించడమే ప్రభుత్వం లక్ష్యం అని చెప్పారు.
గవర్నర్ ప్రసంగం కొత్తగా ఏం లేదు.. కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లే ఉంది - కడియం శ్రీహరి
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలు, లోటుపాట్లను ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం విచారణ చేసి సరిచేస్తుందని హామీ ఇచ్చారు. ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. కాళేశ్వరం అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. ప్రజా వాణి ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం భూమికి సంబంధించినవేనని, ధరణి స్థానంలో మరో పారదర్శక డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు.