Khammam: ఖమ్మంలో నిర్వహించే 'రైతు గోస బీజేపీ భరోసా' బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొంటారని తెలంగాణ బీజేపీ చీఫ్ జీ. కిషన్‌రెడ్డి వెల్లడించారు. దేశరాజధాని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలం వస్తారని తెలిపారు. భద్రాచలంలో శ్రీరామచంద్రుని దర్శించుకున్నతర్వాత మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించే 'రైతు గోస బీజేపీ భరోసా' బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని తెలిపారు.
Telangana BJP president G Kishan Reddy: అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ.కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో రైతులు నిర్లక్ష్యానికి గురయ్యారని విమర్శించారు. ఖమ్మంలో నిర్వహించే 'రైతు గోస బీజేపీ భరోసా' బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొంటారని తెలంగాణ బీజేపీ చీఫ్ జీ. కిషన్‌రెడ్డి వెల్లడించారు. దేశరాజధాని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలం వస్తారని తెలిపారు. భద్రాచలంలో శ్రీరామచంద్రుని దర్శించుకున్నతర్వాత మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించే 'రైతు గోస బీజేపీ భరోసా' బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని తెలిపారు.
ఖమ్మం సభ గురించి మరింతగా వివరించిన కిషన్ రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వంలో గత తొమ్మిదేళ్లుగా రైతులు నిర్లక్ష్యానికి గురయ్యారనీ, ఆదివారం ఖమ్మం సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో రైతు సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ ఏడాది చివరలో రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధం కావడానికి అమిత్ షా పర్యటన ముడిపడి ఉంది. ఈ నెల 27న ఖమ్మంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రైతులనుద్దేశించి ప్రసంగిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. "తెలంగాణలో గత తొమ్మిదేళ్లుగా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పాలనలో రైతులు నిర్లక్ష్యానికి గురయ్యారు. వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణ రైతులకు రుణమాఫీ విషయంలో పూర్తిగా సాయం అందలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రైతులకు సంబంధించిన ఈ సమస్యలన్నింటిపై ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని" అన్నారు.
undefined
అమిత్ షా ర్యాలీకి లక్షలాది మంది హాజరవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. జూన్ లో అమిత్ షా ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉన్నా బీపర్ జాయ్ తుఫాను కారణంగా వాయిదా పడింది. రాష్ట్ర పర్యటన సందర్భంగా అమిత్ షా పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై పార్టీ ఎన్నికల ఏర్పాట్లను అంచనా వేయనున్నారు. క్షేత్రస్థాయి నివేదికలను పరిశీలించి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ ప్రణాళికలు, కార్యక్రమాలపై చర్చిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. "ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు సహా అన్ని వర్గాలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నాయి. తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి, అవినీతి, వంశపారంపర్య రాజకీయాల నుంచి తెలంగాణను విముక్తం చేయడానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కోసం చూస్తున్నారని" ఆ పార్టీ నేత ఒకరు అన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, కలలు సాకారం అయ్యేలా బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. కాగా, ఎన్నికల దగ్గర పడుతుండటంతో దూకుడు పెంచిన బీఆర్ఎస్.. అసెంబ్లీ ఎన్నికల కోసం తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని అంచనాలున్నాయి. అయితే, గెలుపుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ధీమాగా ఉన్నాయి. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనంటూ బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు.