బావి నుండి తప్పించుకొన్న చిరుత: భయాందోళనలో స్థానికులు

By narsimha lodeFirst Published Jan 14, 2021, 4:28 PM IST
Highlights

 వ్యవసాయ బావిలో పడిన చిరుతపులి తప్పించుకొంది. ఈ చిరుతను బావి నుండి రక్షించేందుకు ప్రయత్నించిన రెస్క్యూ టీం విఫలమైంది. అయితే బావి నుండి చిరుతపులి తప్పించుకొంది.ఈ పులి తప్పించుకోవడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు.
 

సిరిసిల్ల: వ్యవసాయ బావిలో పడిన చిరుతపులి తప్పించుకొంది. ఈ చిరుతను బావి నుండి రక్షించేందుకు ప్రయత్నించిన రెస్క్యూ టీం విఫలమైంది. అయితే బావి నుండి చిరుతపులి తప్పించుకొంది.ఈ పులి తప్పించుకోవడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు.

also read:వ్యవసాయ బావిలో పడిన చిరుతపులి: రక్షించే యత్నం చేస్తున్న రెస్క్యూ టీం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయిన్‌పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కోరెపు సురేష్ బావిలో చిరుతపులి పడింది. పొలానికి నీళ్లు పెట్టేందుకు వచ్చిన సురేష్ బావిలో చిరుతను చూసి కంగారుపడ్డాడు.

వెంటనే గ్రామస్తులకు ఆయన సమాచారం ఇచ్చాడు. చిరుతను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున బావి వద్దకు వచ్చారు.  చిరుత బావిలో పడిన విషయాన్ని స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా రెస్క్యూ టీమ్ బావి నుండి చిరుతను బయటకు తీసేందుకు ప్రయత్నించారు.

బావిలో నిచ్చెనతో పాటు తాళ్లను వేశారు. సీసీ కెమెరాలను బిగించారు. వలవేసి చిరుతను పట్టుకోవాలని ప్లాన్ చేశారు. కానీ రెస్క్యూ టీమ్ ప్రయత్నాలు ఫలించలేదు.బుధవారం నాడు రాత్రి వరకు ప్రయత్నించి రెస్క్యూటీమ్ బావి నుండి వెళ్లిపోయింది.

గురువారం నాడు రెస్క్యూటీమ్ బావి వద్దకు వెళ్లింది. కానీ బావిలో చిరుత కన్పించలేదు. దీంతో బావిలోకి  ప్రొక్లెయినర్ సహాయంతో వెళ్లి చూశాడు. కానీ బావిలో చిరుత కన్పించలేదు. 

బావి నుండి చిరుతపులి సమీపంలోకి వెళ్లిపోయిందని అధికారులు భావిస్తున్నారు.స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్థానికులకు సూచిస్తున్నారు.
 

click me!